బీహార్‌లో ఘరో ప్రమాదం జరిగింది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లోని ఓవర్ బ్రిడ్జి కింద భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం పెద్దగా వినిపించడంతో అటుగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవర్ భయంతో రైలును ఆపేశాడు. రైలు ఆగిన తర్వాత ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగి తలోదిక్కున భయంతో పరుగులు తీశారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే…
పూర్తి వివరాల్లోకి వెళితే.. సమస్తిపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో హైవోల్టేజీ విద్యుత్ వైర్, టెలిఫోన్ లైన్ వైర్ ఢీకొనడంతో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి రైల్వే ఓవర్ బ్రిడ్జి దెబ్బతింది. రైల్వే లైన్‌పై పెద్ద పెద్ద రాళ్లు వచ్చి పడ్డాయి. పేలుడు శబ్ధానికి రైలులో కూర్చున్న ప్రయాణికులు తీవ్రంగా వణికిపోయారు. రైలు డ్రైవర్ కూడా భయంతో రైలును ఆపేశాడు. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులు రైల్లోంచి కిందకు దిగి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడికి ఇక్కడకు పరుగులు తీశారు. దీంతో అక్కడంతా టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటినా స్పందించారు. సమాచారం అందుకున్న ఆర్‌పిఎఫ్ హడావుడిగా సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఘటన అనంతరం చాలా సేపు సంఘటన స్థలంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి