Cab Driver: క్యాబ్‌లోనే ప్రసవించిన మహిళ.. ఆ డ్రైవర్ ఏం చేశాడో చూడండి..

రోడ్డు మీద ఏ చిన్న విషయం జరిగినా ముందు సెల్ ఫోన్లకు పనిచెబుతుంటారు జనం. దాన్ని వీడియోలు తీసి పోస్టు చేసి ఏదో సాధించామనే ఫీలింగ్‌తో ఉంటారు. కళ్ల ముందే మర్డర్లు జరుగుతున్నా చలించకుండా వేడుక చూస్తుంటారు. కానీ, ఓ ర్యాపిడో డ్రైవర్ చూపిన చొరవ ఇంటర్నెట్ ను కదిలించింది. ఊహించని ఆపద ఎదురైన భార్య భర్తలకు అతడు చేసిన సాయం ఈ దంపతులు జీవితంలో మర్చిపోలేరేమో..

Cab Driver: క్యాబ్‌లోనే ప్రసవించిన మహిళ.. ఆ డ్రైవర్ ఏం చేశాడో చూడండి..
Rapido Driver Delivers Women

Updated on: Feb 22, 2025 | 6:13 PM

గర్బిణి అయిన తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. తన భార్య ఆస్పత్రికి చేరుకోకముందే ఆమెకు నొప్పులు రావడం మొదలైంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి క్యాబ్ డ్రైవర్ సాయం చేశాడు. ఈ విషయాన్ని ఆ మహిళ భర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ క్యాబ్ డ్రైవర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

గురుగ్రామ్ కు చెందిన భార్యాభర్తలు ఆస్పత్రికి వెళ్లేందుకు ర్యాపిడో క్యాబ్ బుక్ చేసుకున్నారు. మార్గమధ్యంలోనే ఆ మహిళ ప్రసవ వేదనకు గురైంది. క్యాబ్ లోనే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఆ మహిళ భర్తకు ధైర్యం చెప్పి అతడికి సాయం చేశాడు. ఇద్దరూ కలిసి తల్లీబిడ్డను క్షేమంగా ఆస్పత్రికి చేర్చారు. అయితే, ఇంత చేసినా ఆ క్యాబ్ డ్రైవర్ ఎలాంటి ఎక్స్ ట్రా చార్జీలు తమ వద్ద తీసుకోలేదని.. సమయానికి దేవుడిలా ప్రాణాలు నిలిపాడన ఆ వ్యక్తి సోషల్ మీడియా పోస్టులో తెలిపాడు. క్యాబ్ డ్రైవర్ ను వికాస్ గా గుర్తించారు. అయితే, అతడి నంబర్ తమ వద్ద లేదని.. అతడిని కలుసుకుని ఏదైనా సాయం చేయాలని ఉందని మహిళ భర్త తెలిపాడు. అతడి వివరాలు కనుక్కుని అందజేయాలని ర్యాపిడో యాజమాన్యాన్ని ట్యాగ్ చేసి కోరాడు.

ఇక ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మన సమాజానికి వికాస్ వంటి వారు అవసరం అని ఒకరు కామెంట్ చేశారు. ఈ విషయాన్ని లింక్డిన్ లో పోస్ట్ చేస్తే అతడికి రివార్డుల వంటివి లభిస్తాయని మరో నెటిజన్ సూచించాడు. డ్రైవర్‌ను ట్రాక్ చేయడానికి రాపిడో మద్దతు బృందాన్ని ఎలా సంప్రదించాలో మరికొందరు చిట్కాలను అందించారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చాలామంది డ్రైవర్ నిస్వార్థ చర్యను ప్రశంసించారు. డ్రైవర్ తన ప్రయత్నాలకు గుర్తింపు పొందేలా చూసుకోవడానికి సోషల్ మీడియాలో వినియోగదారులు రాపిడోను సంప్రదించాలని సూచించారు.