అతని స్కానింగ్ రిపోర్టు చూసి తలలు పట్టుకున్న డాక్టర్లు.. ఎందుకో తెలుసా?

మనం ప్రతిరోజు ఎన్నో విచిత్రమైన సంఘటనలు వింటూనే ఉంటాం.. కొన్ని కళ్లారా చూస్తుంటాం. ఇది కూడా అటువంటిదే. ప్రకృతికి విరుద్ధంగా, సృష్టికి వ్యతిరేకంగా ఎన్నో సంఘటనలు మనల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తుంటాయి. సహజంగా ఉండేవి అసహజంగా కనిపించినప్పుడు ఔరా అనాల్సి వస్తుంది. సరిగ్గా అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. యూపీలోని కుషీ నగర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తికి తన శరీరంలో ఉండాల్సిన ప్రతి అవయవం అది ఉండాల్ని చోట కాకుండా దానికి వ్యతిరేక దిశలో ఉండటంతో అది అతని […]

అతని స్కానింగ్ రిపోర్టు చూసి తలలు పట్టుకున్న డాక్టర్లు.. ఎందుకో తెలుసా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 04, 2019 | 11:21 AM

మనం ప్రతిరోజు ఎన్నో విచిత్రమైన సంఘటనలు వింటూనే ఉంటాం.. కొన్ని కళ్లారా చూస్తుంటాం. ఇది కూడా అటువంటిదే. ప్రకృతికి విరుద్ధంగా, సృష్టికి వ్యతిరేకంగా ఎన్నో సంఘటనలు మనల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తుంటాయి. సహజంగా ఉండేవి అసహజంగా కనిపించినప్పుడు ఔరా అనాల్సి వస్తుంది. సరిగ్గా అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. యూపీలోని కుషీ నగర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తికి తన శరీరంలో ఉండాల్సిన ప్రతి అవయవం అది ఉండాల్ని చోట కాకుండా దానికి వ్యతిరేక దిశలో ఉండటంతో అది అతని ప్రాణాలమీదికి తెచ్చింది.

జమాలుద్దీన్ అనే వ్యక్తి ఇటీవల తనకు విపరీతంగా కడుపునొప్పి వస్తుందని హాస్పిటల్‌కి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. వాటి రిపోర్టులు పరిశీలించిన డాక్టర్లు వాటిని చూసి షాక్‌కు గురయ్యారు. వారు చూస్తున్నది నిజామా? అబద్దమా? అనేలా వారిని గందరగోళానికి గురిచేశాయి. తీవ్రమైన కడుపునొప్పితో హాస్పిటల్‌లో చేరిన జమాలుద్దీన్‌కు వైద్యులు ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు రాశారు. తీరా అవి వచ్చాక వాటిని చూసి తమను తామే నమ్మలేని పరిస్థితి ఏర్పడింది వైద్యులకు. జమాలుద్దీన్‌కు గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉండటాన్ని గమనించారు వైద్యులు.. దీని వల్లే అతడికి నొప్పి వస్తున్నట్టుగా గుర్తించారు. అయితే అందరికీ ఈ అవయవం కుడివైపున ఉంటుంది. కానీ అతని శరీరంలో మాత్రం కుడివైపున ఉండటం చూసి ఖంగుతిన్నారు. అది ఎడమవైపున ఉన్నందున ఆపరేషన్ చేయలేమంటూ చేతులెత్తేశారు. త్రి డైమన్షనల్ లేపరోస్కోపిక్ యంత్రాలు సహాయంతో మాత్రమే ఆపరేషన్ చేసి గాల్ బ్లాడర్‌లోని రాళ్లను తీయగలమని వైద్యులు నిర్ధారించారు. తమ అనుభవంలో ఇప్పటివరకు ఇలాంటి కేసు తాము చూడలేదని ..ఇదే మొదటిసారంటూ చెప్పుకొస్తున్నారు గోరఖ్‌పూర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు.