హఫీజ్ పై ట్రంప్ ట్వీట్.. ఖండించిన కమిటీ

| Edited By: Srinu

Jul 18, 2019 | 7:56 PM

కరడుగట్టిన పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అరెస్టుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ను సాక్షాత్తూ ఆ దేశ విదేశీ వ్యవహారాల కమిటీ ఖండించడం విశేషం. 10 ఏళ్లుగా పాకిస్థాన్ ప్రభుత్వం హఫీజ్ సయీద్ కోసం సెర్చ్ చేస్తూ వచ్చిందని, ఇన్నేళ్ల తరువాత అతడ్ని పాక్ అరెస్టు చేసిందని ట్రంప్ ట్వీట్ చేశారు. కానీ ఈ వ్యాఖ్యను ఈ కమిటీ తొసిపుచ్చుతూ … ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన ఈ ఉగ్రవాది పాకిస్తాన్ లో […]

హఫీజ్ పై ట్రంప్ ట్వీట్.. ఖండించిన కమిటీ
Follow us on

కరడుగట్టిన పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అరెస్టుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ను సాక్షాత్తూ ఆ దేశ విదేశీ వ్యవహారాల కమిటీ ఖండించడం విశేషం. 10 ఏళ్లుగా పాకిస్థాన్ ప్రభుత్వం హఫీజ్ సయీద్ కోసం సెర్చ్ చేస్తూ వచ్చిందని, ఇన్నేళ్ల తరువాత అతడ్ని పాక్ అరెస్టు చేసిందని ట్రంప్ ట్వీట్ చేశారు. కానీ ఈ వ్యాఖ్యను ఈ కమిటీ తొసిపుచ్చుతూ … ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన ఈ ఉగ్రవాది పాకిస్తాన్ లో స్వేఛ్చగా తిరుగుతున్నాడని, పదేళ్లుగా అతనికోసం ఎలాంటి గాలింపు జరగలేదని పేర్కొంది. హఫీజ్ ని మొదట అరెస్టు చేసి.. ఆ తరువాత 2001 డిసెంబరులోనూ, 2002 మే నెల లోను, అదే ఏడాది అక్టోబరులోను విడుదల చేశారని ఈ కమిటీ గుర్తు చేసింది. అలాగే 2006 లో రెండుసార్లు, 2008 డిసెంబరులో, 2009 సెప్టెంబరులో, 2017 జనవరిలో విడుదల చేస్తూ వచ్చారని తెలిపింది. అతడ్ని దోషిగా ప్రకటించేంతవరకు కాస్త ‘ ఓపిక పట్టండి ‘ అని సెటైర్ వేసింది. బెయిల్ కోరేందుకు హఫీజ్ లాహోర్ లోని యాంటీ టెర్రరిజం కోర్టుకు వెళ్తుండగా.. బుధవారం అరెస్టు చేశారు. ఇందుకు హర్షం ప్రకటించిన ట్రంప్.. గత రెండేళ్లుగా తన ప్రభుత్వం పాకిస్తాన్ పై తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఇది జరిగిందని ట్వీట్ చేశారు. కాగా-పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ నెల 22 న ట్రంప్ ను వైట్ హౌస్ లో కలుసుకోనున్నారు.