HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత.. మీడియాతో మాట్లాడుతూ..

HD Kumaraswamy hospitalised: కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం కుమారస్వామి బెంగళూర్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగానే అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా కుమారస్వామి ముక్కు నుంచి రక్తం కారింది..

HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత.. మీడియాతో మాట్లాడుతూ..
Hd Kumaraswamy

Updated on: Jul 28, 2024 | 9:11 PM

HD Kumaraswamy hospitalised: కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం కుమారస్వామి బెంగళూర్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగానే అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా కుమారస్వామి ముక్కు నుంచి రక్తం కారింది.. దీంతో ఒక్కసారిగా అంతా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఆయన్ను హుటాహుటిన బెంగళూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కుమారస్వామి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు ప్రకటించారు.

కాగా.. వచ్చే వారం బీజేపీ-జేడీఎస్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన వివరాల గురించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన ముక్కు నుంచి రక్తం కారడం, చొక్కాపై రక్తపు మరకలతో ఉన్న దృశ్యాలతో జేడీఎస్‌ కార్యకర్తలు, నేతలు ఆందోళనకు గురయ్యారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..