హత్రాస్ కేసులో కాంగ్రెస్ పార్టీపై యూపీ ప్రభుత్వం ‘ఎదురుదాడికి’ దిగింది. ఈ నెల 3 న నిషేధాజ్ఞలను ధిక్కరించి ఢిల్లీ-నోయిడా సరిహద్దుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. గౌతమ బుధ్ధ నగర్ కాంగ్రెస్ పార్టీ శాఖ మనోజ్ చౌదరి, నోయిడా శాఖ చీఫ్ షాహబుద్దీన్ సహా పేర్లు తెలియని 500 మంది మీద వివిధ సెక్షన్ల కింద ఈ చర్య తీసుకున్నారు. అలాగే పనిలో పనిగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, ఆయన పార్టీకి చెందిన 400 మంది కార్యకర్తలమీద కూడా ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేశారు. వీళ్లంతా ఎపిడమిక్ యాక్ట్ ని అతిక్రమించారని, చట్ట వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో గుమికూడారని…ఇలాగే పలు కారణాలను చూపుతూ ఈ ప్రాథమిక సమాచార నివేదికను తయారు చేశారు.