జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ రాజీనామా..?

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గిరీష్‌ చంద్ర ముర్ము తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. ఆయన తన..

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ రాజీనామా..?

Edited By:

Updated on: Aug 06, 2020 | 6:30 AM

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గిరీష్‌ చంద్ర ముర్ము తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. ఆయన తన లెఫ్లినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు బుధవారం ఉదయం నుంచి జమ్ముకశ్మీర్ ప్రాంతంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది. ఆర్టికల్ 370 రద్దు చేసి ఏడాది గడిచిన సంగతి తెలిసిందే. గతేడాది జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌కు తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ముర్ము గతేడాది అక్టోబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అయితే “కాగ్‌”చీఫ్‌గా ముర్మును నియమించబోతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

పూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్‌