Murrah Buffalo: ఈ గేదె మహా అందగత్తె! రోజుకు 15 లీటర్ల పాలు, అందాల పోటీల్లో ఎన్నో ప్రైజ్‌లు

| Edited By: Ram Naramaneni

Oct 01, 2023 | 4:23 PM

అందచందాల్లో ఈ గేదెకు సాటిలేరెవ్వరూ. వయసు మూడేళ్లే.. కానీ రోజుకు 15 లీటర్ల వరకు పాలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హరియాణాకు చెందిన ఓ ముర్రా జాతి గేదె కథ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమ్రోగి పోతోంది. అందాల పోటీల్లో వరుస బహుమతులు అందుకుంటూ ఔరా అనిపిస్తోంది. ఈ గేదె కథ మీకోసం.. హరియాణాలోని భివానీ జిల్లాకు చెందిన ముర్రా జాతి గేదె రోజుకు 15 లీటర్ల పాలు ఇస్తోంది. కేవలం పాల ఉత్పత్తిలోనే కాకుండా అందంలోనూ అందరినీ ఆకట్టుకుంటోంది. పలు రాష్ట్రాల్లో నిర్వహించిన గేదెల అందాల పోటీల్లో ఎన్నో..

Murrah Buffalo: ఈ గేదె మహా అందగత్తె! రోజుకు 15 లీటర్ల పాలు, అందాల పోటీల్లో ఎన్నో ప్రైజ్‌లు
Murra Buffalo
Follow us on

హర్యాణా, అక్టోబర్ 1: అందచందాల్లో ఈ గేదెకు సాటిలేరెవ్వరూ. వయసు మూడేళ్లే.. కానీ రోజుకు 15 లీటర్ల వరకు పాలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హరియాణాకు చెందిన ఓ ముర్రా జాతి గేదె కథ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమ్రోగి పోతోంది. అందాల పోటీల్లో వరుస బహుమతులు అందుకుంటూ ఔరా అనిపిస్తోంది. ఈ గేదె కథ మీకోసం.. హరియాణాలోని భివానీ జిల్లాకు చెందిన ముర్రా జాతి గేదె రోజుకు 15 లీటర్ల పాలు ఇస్తోంది. కేవలం పాల ఉత్పత్తిలోనే కాకుండా అందంలోనూ అందరినీ ఆకట్టుకుంటోంది. పలు రాష్ట్రాల్లో నిర్వహించిన గేదెల అందాల పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకుంది. దీంతో ఈ గేదె ప్రస్తుతం హరియాణా రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రెటీ హోదా దక్కించుకుంది.

ఈ ముర్రా జాతి గేదెకు దాని యజమాని సంజయ్‌ ముద్దుగా ధర్మ అనే పేరు కూడా పెట్టుకున్నాడు. ధర్మను మూడేళ్లుగా పోషిస్టున్నాడు యజమాని సంజయ్‌. తాజాగా దానికి ఓ దూడ కూడా జన్మించింది. ధర్మ తన యజమానికి మంచి లాభాలు అర్జిస్తున్నప్పటికీ దాని పోషణకు కూడా అదే స్థాయిలో ఖర్చవుతుందని సంజయ్ చెబుతున్నాడు. మంచి ధర వస్తే ధర్మను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. ఈ ముర్రా జాతి గేదెను రూ.61లక్షలకు అమ్ముతానని అంటున్నాడు. రోజుకి పచ్చిగడ్డి, వివిధ రకాల గింజలు, 40 కిలోల క్యారెట్లు థర్మకు ఆహారంగా పెడుతున్నట్లు తెలిపాడు. పంజాబ్, ఉత్తర్​ప్రదేశ్​రాష్ట్రాల్లో నిర్వహించిన పలు అందాల పోటీల్లో ధర్మ బహుమతులు సాధించినట్లు సంజయ్‌ మీడియాకు తెలిపాడు. థర్మ చాలా అందంగా ఉంటుంది. ఇది చూడటానికి చిన్న ఏనుగులా కనిపిస్తుంది.

బహుశా హరియాణా రాష్ట్రంలోనే ఈ గేదె అంత అందమైనది మరొకటి లేకపోవచ్చని పశువైద్యుడు డాక్టర్ హృతిక్ తెలిపాడు. కాగా ముర్రా గేదెలు హరియాణాలో చాలా ఫేమస్‌. మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ వీటికి మంచి ఆదరణ ఉందని కర్నాల్ పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ధర్మేంద్ర సింగ్ తెలిపారు. సాధారణ గేదెలతో పోలిస్తే, ముర్రా జాతి గెదేలు అధిక పాలు ఇస్తాయని, రోజుకు 15 నుంచి 20 లీటర్ల వరకు పాలు ఇస్తాయని ఆయన వెల్లడించారు. మంచి పోషణ అందిస్తే ఈ జాతి గేదెలు రోజుకు 30 లీటర్ల వరకు పాలు ఇస్తాయని అన్నారు. ఈ గేదె పాలల్లో పోషకాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని డాక్టర్ ధర్మేంద్ర సింగ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.