Haryana Landslide: ఘోర ప్రమాదం.. విరిగిపడిన కొండ చరియలు.. శిథిలాల కింద 20 మంది కూలీలు!

|

Jan 01, 2022 | 3:32 PM

Haryana Landslide: హర్యానాలో ఘరో ప్రమాదం చోటుచేసుకుంది. మైనింగ్ ప్రాంతంలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒకరు మరణించగా.. శిథిలాల

Haryana Landslide: ఘోర ప్రమాదం.. విరిగిపడిన కొండ చరియలు.. శిథిలాల కింద 20 మంది కూలీలు!
Haryana Landslide
Follow us on

Haryana Landslide: హర్యానాలో ఘరో ప్రమాదం చోటుచేసుకుంది. మైనింగ్ ప్రాంతంలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒకరు మరణించగా.. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకున్నట్లు పేర్కొంటున్నారు. హర్యానాలోని బివానీ జిల్లాలోని తోషమ్ ప్రాంతంలో దాడమ్ మైనింగ్ జోన్లో ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద దాదాపు 20 మంది గల్లంతైనట్లు సమాచారం. దాడమ్‌ మైనింగ్‌ జోన్‌లో క్వారీ పనులు చేస్తుండగా.. కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న వాహనాలతోపాటు పనిచేస్తున్న కూలీలు కొండచరియల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు.

ఇప్పటివరకు ముగ్గురిని కాపాడినట్లు పేర్కొంటున్నారు. ఒక మృతదేహాన్ని వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. శిథిలాల కింద మరో 15 నుంచి 20 మంది ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘దాడమ్‌ మైనింగ్‌ జోన్‌లో కొండచరియలు విరిగిపడటం దురదృష్టకరం. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఖట్టర్ తెలిపారు.

Also Read:

Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరొకరు బలి.. సైకిల్‌పై వెళుతుండగా దూసుకొచ్చిన మృత్యువు

Visakhapatnam Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం..