Haryana CM : హర్యానా అసెంబ్లీ బలపరీక్షలో గెలిచిన సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి

|

Mar 10, 2021 | 5:52 PM

Haryana CM : హర్యానా అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గారు సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రభుత్వానికి మద్దతుగా 55 ఓట్లు రాగా , వ్యతిరేకంగా కేవలం 32 ఓట్లు మాత్రమే..

Haryana CM : హర్యానా అసెంబ్లీ బలపరీక్షలో గెలిచిన సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌,  కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి
Follow us on

Haryana CM : హర్యానా అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గారు సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రభుత్వానికి మద్దతుగా 55 ఓట్లు రాగా , వ్యతిరేకంగా కేవలం 32 ఓట్లు మాత్రమే రావడంతో కట్టర్‌ సర్కార్‌ బలపరీక్షలో గెలిచింది. రైతుల ఆందోళను కట్టర్‌ ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ అసెంబ్లీలో ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టింది. విజయం అనంతరం కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కట్టర్‌. ప్రభుత్వంపై ప్రతి ఆరునెలలకోసారి అవిశ్వాస తీర్మానం పెట్టుకోవచ్చని సవాల్‌ విసిరారు. రైతులకు తమ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉందన్నారు కట్టర్ ఈ సందర్బంగా మరోసారి స్పష్టం చేశారు.

హర్యానాలో సీఎం మనోహర్ లాల్ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టినవేళ, పాలక బీజేపీ-జన నాయక్ జనతా పార్టీ తమ సభ్యులందరికీ తప్పనిసరిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది. హర్యానా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విపక్ష నేత భూపేందర్ సింగ్ హుడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 23 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన ఈ తీర్మానాన్ని స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తా ఆమోదించిన నేపథ్యంలో బలపరీక్ష జరిగింది. పాలక కూటమికి మద్దతు ఇఛ్చిన ఇద్దరు స్వతంత్ర సభ్యులు తమ సపోర్టును ఉపసంహరించుకున్నారని భూపేందర్ సింగ్ హుడా నిన్న తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వం ప్రజల, ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన ఆయన అన్న మాటలు ఇవాళ పటాపంచలయ్యాయి.

90 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ లో బీజేపీ నుంచి 40 మంది, జెజేపీ నుంచి 10 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా స్వతంత్ర సభ్యులు చాలామంది ఉన్నారు. వారి మద్దతుతో తమ అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని విపక్ష కాంగ్రెస్ భావించగా అది కాస్తా బెడిసికొట్టింది.

Read also : Telangana MLC Elections : నాలుగు రోజులే టైం, అందరికీ ఒక్కటే టార్గెట్‌, 2 సీట్లు.. 13 మంది మంత్రులు, కత్తిమీద సాములా ఎమ్మెల్సీ ఎన్నికలు