Farmers Protest:ఇది పంటకాలం మరి! రైతునేతల కొత్త ప్లాన్! నిరసన శిబిరాల వద్దకు 15 మంది చాలు! పోరుబాటలో మలుపు

వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు ఇక తమ ప్రొటెస్ట్ లో కొత్త వ్యూహాన్ని అనుసరించనున్నారు.  బసంత్ పంచమి సందర్భంగా  పంట కోతల కాలం (హార్వెస్ట్ సీజన్) ..

Farmers Protest:ఇది పంటకాలం మరి! రైతునేతల కొత్త ప్లాన్! నిరసన శిబిరాల వద్దకు 15 మంది చాలు! పోరుబాటలో మలుపు

Edited By:

Updated on: Feb 17, 2021 | 1:15 PM

New Strategy In Farmers Protest: వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు ఇక తమ ప్రొటెస్ట్ లో కొత్త వ్యూహాన్ని అనుసరించనున్నారు.  బసంత్ పంచమి సందర్భంగా  పంట కోతల కాలం (హార్వెస్ట్ సీజన్)  ప్రారంభమైంది గనుక రైతులంతా తమ ఇళ్లకు వెళ్లి తమ పొలం పనుల్లో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ రైతు సంఘాలు నూతన ప్లాన్ కి శ్రీకారం చుట్టాయి. ప్రతి గ్రామం నుంచి 15 మంది అన్నదాతలు నిరసన శిబిరాలవద్దకు చేరుకుంటే చాలునని, మిగిలినవారు ఇళ్లకు వెళ్ళవచ్చునని ఇవి సూచించాయి. అంటే ఒక విధంగా రైతులు రొటేషన్ బేసిస్ పై నిరసన శిబిరాలవద్దకు వస్తూ..పోతుంటారు. ఘాజీపూర్ ప్రొటెస్ట్ సైట్ వద్ద మీడియాతో మాట్లాడిన రైతు నేత గుర్మీత్ సింగ్.. ఈ ప్రదేశం వద్ద 4 వేలనుంచి 5 వేలమంది రైతులను మోహరిస్తే చాలునని తాము నిర్ణయించామన్నారు. అయితే మేము పిలిస్తే 24 గంటల్లో లక్ష మంది రైతులు ఇక్కడికి చేరుకుంటారన్నారు. వారం రోజుల తరువాత ఈ 15 మంది రైతుల స్థానే మరో 15 మంది వస్తారని చెప్పారు. ఇలా ఆందోళన మాత్రం విరమించకుండా, దీన్ని కొనసాగిస్తుంటామని, ఆపే ప్రసక్తి లేదని అన్నాడు.

కాగా సింఘు, ఘాజీపూర్ నిరసన శిబిరాలు ఇప్పుడు బోసిగా కనిపిస్తున్నాయి. చాలామంది అన్నదాతలు మళ్ళీ తమ ఇళ్లకు మళ్లారు. కానీ వృధ్ధ రైతులు మాత్రం ఇక్కడ సేద దీరుతున్నారు. రానున్న మూడు నెలలూ రైతుల పంటల కాలం.. యూపీలో ఇప్పుడు చెరకు పంట విస్తారంగా పండుతోంది. చక్కెర మిల్లులు కూడా తెరచి ఉన్నాయి గనుక చెరకు రైతులు తమ పంటను ఆ మిల్లులకు చేర్చాల్సి ఉంది.

Also Read:

Ri Sol Ju Reappears: ఎన్నాళ్లకెన్నాళ్లకు ?ఏడాది తరువాత మళ్ళీ పబ్లిక్ గా కనిపించిన కిమ్ భార్య రీ సోల్ జూ

Faf du Plessis retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ షాకింగ్ నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై