Ri Sol Ju Reappears: ఎన్నాళ్లకెన్నాళ్లకు ?ఏడాది తరువాత మళ్ళీ పబ్లిక్ గా కనిపించిన కిమ్ భార్య రీ సోల్ జూ
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ భార్య రీ సోల్ జూ ఇన్నాళ్లకు మళ్ళీ పబ్లిక్ గా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏడాది నుంచి అసలు ఈమె జాడ కనిపించకపోవడంతో..
Ri Sol Ju Reappears: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ భార్య రీ సోల్ జూ ఇన్నాళ్లకు మళ్ళీ పబ్లిక్ గా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏడాది నుంచి అసలు ఈమె జాడ కనిపించకపోవడంతో ఎన్నో ఊహాగానాలు, వదంతులు, వార్తలు గుప్పుమన్నాయి. కరోనా వైరస్ భయంతో ఆమె అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళిపోయి ఉండవచ్చునని కొందరు అంటే.. తన అస్వస్థత కారణంగా భర్తకు కూడా చెప్పకుండా పోయిందని, మరికొందరు..కాదు..కాదు.. కిమ్ స్వయంగా ఆమెను పంపివేశాడని మరికొందరు..ఇలా రకరకాల వదంతులు పుట్టుకొచ్చాయి. పూర్తిగా అనారోగ్యం బారిన పడిన తన సమీప బంధువుకు సేవలు చేసేందుకు రీ వెళ్లిందని, అలాకాక తన ఇద్దరు పిల్లల చదువు కోసం గుర్తు తెలియని ప్రదేశానికి పయనమైందని కూడా వార్తలు వచ్చాయి. ఏమైతేనేం ? ఏడాది అనంతరం మొత్తానికి మాజీ నేత కిమ్ జాంగ్-2 జయంతి సందర్భంగా జరిగిన మ్యూజికల్ ప్రోగ్రామ్ కి ఈమె హాజరైంది.
తన భార్యతో కలిసి కిమ్ ఆడిటోరియానికి చేరుకోగానే అందరూ హర్షాతిరేకంతో చప్పట్లు చరిచి వారికి స్వాగతం పలికారు. నార్త్ కొరియాలోని ప్రముఖ వార్తా పత్రికల మొదటి పేజీల్లో ఈ భార్యా భర్తల ఫోటోలను ప్రచురించారు. కిమ్ తో బాటు అతని కుటుంబ సభ్యుల ఆరోగ్య రహస్యాలను ప్రభుత్వం కాపాడుకొంటూ వస్తోంది. కేవలం కిమ్ సన్నిహితులకు తప్ప మరెవరికీ ఈ వివరాలు తెలియవు. 2009 లో కిమ్..రీ సోల్ జూను పెళ్లి చేసుకున్నప్పటికీ 2012 లో ఆమెను తన భార్యగా అందరికీ పరిచయం చేశాడు.
Also Read:
Donald Trump: చిక్కుల్లో పడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఫెడరల్ కోర్టులో కేసు
SBI Annuity Scheme: ఎస్‌బీఐ అద్భుతమైన పథకం.. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ. 10,000 పొందవచ్చు