SBI Annuity Scheme: ఎస్‌బీఐ అద్భుతమైన పథకం.. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ. 10,000 పొందవచ్చు

SBI Annuity Scheme: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్ల కోసం రోజురోజుకు కొత్త కొత్త స్కీమ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం ఉంటున్న ఖర్చులు,...

SBI Annuity Scheme: ఎస్‌బీఐ అద్భుతమైన పథకం.. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ. 10,000 పొందవచ్చు
Follow us

|

Updated on: Feb 17, 2021 | 11:29 AM

SBI Annuity Scheme: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్ల కోసం రోజురోజుకు కొత్త కొత్త స్కీమ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం ఉంటున్న ఖర్చులు, ఆదాయం తదితర కారణాల వల్ల ఆదాయం పెంచుకునేందుకు అవకాశాలు కల్పిస్తోంది. అయితే ప్రజలు తమ భవిష్యత్తులో వేర్వేరు పెట్టుబడులు పెడుతుంటారు. కానీ కొన్ని సార్లు పెట్టుబడుల వషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు ఏర్పడతాయి. అందుకే సరైన స్కీమ్‌లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇందు కోసం ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌ను పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ పథకంలో డిపాజిట్‌ చేసే కొంత కాలం తర్వాత క్రమంగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌:

ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌లో 36,60,84 లేదా 120 నెలల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. ఎంత కాలపరిమితి ఎంచుకున్నా పెట్టుబడిపై వడ్డీ రేటు ఒకే విధంగా ఉంటుంది. మీరు ఐదేళ్లపాటు ఫండ్‌ డిపాజిట్‌ చేస్తే అప్పుడు మీకు ఐదేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు వర్తించే వడ్డీ రేటు ప్రకారం మాత్రమే వడ్డీ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

రూ.10వేల నెలవారీ ఆదాయం

ఒక పెట్టుబడిదారుడు ప్రతినెల రూ.10వేల ఆదాయం కావాలనుకుంటే రూ.5,07,964 జమ చేయాల్సి ఉంటుంది. జమ చేసిన తర్వాత ఈ మొత్తంపై 7శాతం వడ్డీ రేటు పొందవచ్చు. ఇది ప్రతినెలా సుమారు రూ.10వేల వరకు వస్తుంది. మీరు రూ.5 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టాలని భావిస్తే భవిష్యత్తులో మీ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం ఉంటుంది.

మరి ఇంత పెట్టుబడి పెట్టలేనివారికి..

ప్రతినెలా కనీసం వెయ్యి రూపాయల చొప్పున ఎస్‌బీఐలోయాన్యుటీ పథకంలో జమ చేయవచ్చు. ఇందులో గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. నిర్ధిష్ట సమయం అనంతరం జమ చేసిన డబ్బు మొత్తంపై వడ్డీ ప్రారంభం అవుతుంది. ఈ పథకం భవిష్యత్తులో క్రమంగా ఆదాయం పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశమేనని చెప్పాలి. అయితే మధ్య తరగతి వారు ఇంత మొత్తంలో డబ్బు జమ చేయకపోవచ్చు. ఈ ప్రయోజనం పొందే అవకాశం తక్కువే కావచ్చు.

పెట్టుబడి కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బు లేనివారికి రికరింగ్‌ డిపాజిట్‌ సరైనది. భవిష్యత్తు అవసరాల కోసం చిన్న మొత్తంలో ప్రతి నెల ఇందులో డిపాజిట్‌ చేయవచ్చు. ఆర్‌డీలో చిన్న పొదుపుల ద్వారా ఈ మొత్తాన్ని సేకరించి, దానిపై వడ్డీని వర్తింపజేయడం ద్వారా మంచి రాబడిని అందిస్తుంది. సామాన్య ప్రజలకు ఇది అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని అంశాలు..

మీరు ఎంచుకున్నంత గడువు వరకు డిపాజిట్‌ చేసిన తర్వాత అప్పటి నుంచి వడ్డీతో పాటు కొంత అసలు కలిపి నెలవారీగా ఆదాయం పొందవచ్చు. కనీస గడువు 36 నెలలు లేదా మూడు సంవత్సరాలు అంటే నెలకు కనీసం రూ.1000 డిపాజిట్‌ చేయాలి. అప్పుడు మొత్తం డిపాజిట్‌ రూ.36వేలు అవుతుంది. గరిష్ఠ పరిమితి లేదు. ఎస్‌బీఐ ఉద్యోగులకు, పెన్షనర్‌లకు వడ్డీ రేటు ఒక శాతం ఎక్కువగా ఉంటుంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సీనియర్‌ సిటిజన్లకు 0.05 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. ప్రతి నెల మీ పొదుపు ఖాతాలలోకి ఇది జమ అవుతుంది. అంతేకాదు నామినీ సదుపాయం కూడా ఉంది. ప్రత్యేక సందర్భాల్లో డిపాజిట్‌పై 75 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. అయితే రుణం తీసుకున్న తర్వాత ప్రతి నెల దీనిపై వచ్చే ఆదాయం రుణ ఖాతాలోకి వెళ్తుంది. అలాగే పాస్‌బుక్‌ కూడా జారీ చేస్తుంది. ఒక బ్యాంకు శాఖ నుంచి మరో శాఖకు ఈ ఖాతాను బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఖాతాదారుడు మరణించినట్లయితే ముందస్తు ఉపసంహరణ చేసుకునే అవకాశం కూడా ఉంది. దీనికి ఛార్జీలు వర్తిస్ఆయి. రూ.1.5 లక్షల వరకు డిపాజిటర్‌పై మాత్రమే ముందస్తు ఉపసంహకరణ లభిస్తుంది.

Also Read:

AP Panchayat Elections 2021 live: ఏపీలో కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికలు.. ఉదయం 10.30 గంటలకు 40.29 శాతం పోలింగ్.

IOCL Recruitment 2021:ఇంటర్ నుంచి ఇంజనీర్ వరకు అభ్యర్థులను ఉద్యోగాలకు ఆహ్వానిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్