Faf du Plessis retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ షాకింగ్ నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు...
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఇదే సరైన సమయమని తన మనసు చెబుతున్నట్లు రాసుకొచ్చాడు. ఇటీవల పాకిస్తాన్ పర్యటనలో సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆ పర్యటనలో విఫలమనప్పటి నుంచి డుప్లెసిస్ ఫామ్‌పై విమర్శలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా ఇటీవలి శ్రీలంక పర్యటనలో, డు ప్లెసిస్ అద్భుతమైన సెంచరీ సాధించాడ. గత సంవత్సరం నుంచి అతని ఫామ్‌ని ప్రశ్నిస్తున్నవారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. కానీ సడన్‌గా ఈ నిర్ణయం అతడి అభిమానులను షాక్‌కు గురిచేసింది.
View this post on Instagram
2012 నవంబరులో ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫాఫ్ డుప్లెసిస్.. చివరిగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆడిన 69 టెస్టుల్లో.. 4 వేలకు పైగా రన్స్ చేశాడు. అందులో 10 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 36 టెస్టుల్లో సౌతాఫ్రికా జట్టుకు డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Also Read: