Harvard research: మెడిటేషన్ మెదడు వృద్ధాప్యాన్ని తగ్గిస్తుందట..

హార్వర్డ్‌కు అనుబంధమైన మాసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు మెడిటేషన్ ద్వారా మెదడు వృద్ధాప్యాన్ని 5.9 సంవత్సరాల వరకు తగ్గించవచ్చని ఒక వినూత్న అధ్యయనంలో కనుగొన్నారు. ఈ పరిశోధన సద్గురు రూపకల్పన చేసిన, ఇషా ఫౌండేషన్ అందిస్తన్న సమ్యమ సాధన అనే అధునాతన యోగిక ధ్యానం కార్యక్రమంపై ఫోకస్ చేసింది.

Harvard research: మెడిటేషన్ మెదడు వృద్ధాప్యాన్ని తగ్గిస్తుందట..
Sadhguru's Meditation

Updated on: May 21, 2025 | 8:37 PM

ధ్యానం, యోగా సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, మన మనస్సు,  మైండ్ కూడా యవ్వనంగా ఉంటుంది. ఈ విషయం ఒక పరిశోధన ద్వారా వెలుగులోకి వచ్చింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో అనుబందమైన రెండు ప్రధాన వైద్య సంస్థలు, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్,  బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ పరిశోధకులు సద్గురు రూపొందించిన ధ్యాన కార్యక్రమం ‘సమయ సాధన’ మెదడు వయస్సును దాదాపు 5.9 సంవత్సరాలు తగ్గించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. అధునాతన యోగిక్ మెడిటేషన్‌ చేస్తే మెదడు వయస్సు సగటు 5.9 సంవత్సరాలు తగ్గిపోతుందని తేల్చారు. సద్గురు రూపొందించిన “సమ్యమ సాధన” అనే స్పెషల్ మెడిటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వాళ్లపై ఈ స్టడీ జరిగింది. పరిశోధనలో, నిద్రలో వారి మెదడు కార్యకలాపాలు EEG హెడ్‌బ్యాండ్‌ల సహాయంతో రికార్డు చేశారు. దీని నుంచి బ్రెయిన్ ఏజ్ ఇండెక్స్ (BAI) డేటాను సేకరించారు.

ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్

మెడిటేషన్ చేసిన వాళ్ల మెదడు వయస్సు, వారి అసలు వయస్సుతో పోల్చితే 5.9 సంవత్సరాలు చిన్నగా ఉందట!

మంచి నిద్ర రావడమే కాదు, ఆ నిద్ర ప్రగాఢంగా ఉండటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుందట

ఈ మెడిటేషన్ ఫాలో అయ్యే వాళ్లు, నిగ్రహంతో ఉండటంతో పాటు క్లారిటీగా ఆలోచించగలిగే శక్తి కూడా పెరిగిందట.

ఒత్తిడి తగ్గడం, ఒంటరితనం దూరమవడం లాంటి అదనపు ప్రయోజనాలూ కనిపించాయి.

సమ్యమ సాధన అంటే ఏమిటి?

ఇది సద్గురు డిజైన్ చేసిన ఒక యూనిక్ మెడిటేషన్ ప్రోగ్రామ్. 8 రోజుల ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముందు 40 రోజుల కఠినమైన ప్రిపరేషన్ ఉండాలి.

ప్రిపరేషన్‌లో: శుభ్రమైన డైట్ (వేగన్ ఫుడ్), రోజూ శంభవి మహాముద్ర క్రియ, శక్తి చలన క్రియ, యోగాసనాలు, శూన్య ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయాలి.

అసలు ప్రోగ్రామ్: ఇది 4 రోజుల సైలెన్స్ మెడిటేషన్.

సాధనతో వచ్చిన మార్పులు

మెదడులో “బ్రెయిన్ ఏజ్ ఇండెక్స్” (BAI) అనే మెజర్ మెడిటేషన్ వల్ల చాలా తక్కువగా ఉండటం కనిపించింది.

ఇది మెదడు మందగించడం అల్జీమర్స్ వంటి రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు అంటున్నారు.

సద్గురు ఏమంటున్నారు?

“మనిషి తన ఆరోగ్యం మీద పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం. మెడిటేషన్ వల్ల మెదడు ఎనర్జిటిక్‌గా ఉండడమే కాకుండా, వృద్ధాప్యాన్ని కూడా తగ్గించొచ్చు. ఇది మనకి మాత్రమే కాదు, మన కుటుంబానికి, భవిష్యత్తు తరాలకూ ఉపయోగపడుతుంది,” అని సద్గురు X లో కామెంట్ చేశారు.

శాస్త్రవేత్తల మాటల్లో

ఈ అధ్యయనానికి కీలకమైన వ్యక్తిగా వ్వవహరించిన డాక్టర్ బాలచందర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ “ఆదికాలం నుండి వచ్చిన యోగ ప్రాక్టీసులు, ఈ రోజుల్లో శాస్త్రీయ పరిశీలనల్లో కూడా కీలకంగా నిలబడగలుగుతున్నాయి. ఈ ఫలితాలు ప్రాచీన, పాశ్చాత్య శాస్త్రాలను కలిపే దిశగా ముందడుగు” అని అన్నారు.

ఈ స్టడీ చెప్పేదేమిటంటే, మెడిటేషన్ చేయడం వల్ల మెదడుకి కూడా యవ్వనమే! ధ్యానం కేవలం శారీరక ఆరోగ్యానికి కాదు, మెదడు ఆరోగ్యాన్ని కూడా సుదీర్ఘంగా కాపాడటానికి ఒక మేజర్ టూల్‌గా మారుతోంది. ప్రాక్టీస్ చెయ్యండి, ఫిట్‌గా ఉండండి