Viral Video: మహా ప్రసాదాన్ని డైనింగ్ టేబుల్‌పై వడ్డించిన పూజారి… అడ్డుకుని ఆగ్రహించిన పూరి జగన్నాథుని భక్తులు
దేవుని ప్రసాదానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎవరైనా ప్రసాదం పెడితే చెప్పులు విడిచి భక్తితో స్వీకరిస్తుంటారు. కాళ్లు చేతులు కడుక్కుని పవిత్రమైన స్థలంలో ఆరగిస్తుంటారు. అలాంటిది మహా దేవుని మహా ప్రసాదాన్ని డైనింగ్ టేబుల్‌పై వడ్డించడం వివాదాస్పదంగా మారింది. ఒడిశాలోని పూరీలో జరిగిన సంఘటనపై భక్తులు సోషల్ మీడియాలో...

దేవుని ప్రసాదానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎవరైనా ప్రసాదం పెడితే చెప్పులు విడిచి భక్తితో స్వీకరిస్తుంటారు. కాళ్లు చేతులు కడుక్కుని పవిత్రమైన స్థలంలో ఆరగిస్తుంటారు. అలాంటిది మహా దేవుని మహా ప్రసాదాన్ని డైనింగ్ టేబుల్‌పై వడ్డించడం వివాదాస్పదంగా మారింది. ఒడిశాలోని పూరీలో జరిగిన సంఘటనపై భక్తులు సోషల్ మీడియాలో భగ్గుమంటున్నారు.
ప్రముఖ జగన్నాథ స్వామి మహా ప్రసాదాన్ని బీచ్ రిసార్ట్ వద్ద టేబుల్‌పై భోజనం చేస్తున్న వారికి పూజారి వడ్డించడం వివాదానికి కారణమైంది. ఆలయ సంప్రదాయానికి విరుద్ధంగా సాక్షాత్తు ఓ పూజారే ఇలా ఎలా చేస్తాడని స్థానికులు అడ్డుకున్నారు. పూరీలోని బీచ్ రిసార్ట్‌లో ఓ కుటుంబానికి చెందిన దాదాపు పదిమంది సభ్యులు డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని భోజనం చేస్తుండగా పూజారి మహాప్రసాదం వడ్డించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పూజారి నిర్వాకాన్ని గమనించిన ఒక వ్యక్తి ఆయన చర్యను అడ్డుకున్నారు. నేలపై కూర్చొని మాత్రమే మహాప్రసాదాన్ని స్వీకరించడం ఆలయ సంప్రదాయమని ఆ వ్యక్తం కుటుంబ సభ్యులతో పాటు పూజారికి గుర్తు చేశాడు. ఆలయ సాంప్రయాదానికి విరుద్ధంగా పూజారివై ఉండి ఎలా చేస్తారని నిలదేశాడు. వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు జగన్నాథ ఆలయ కార్యాలయం దీనిపై రియాక్ట్ అయింది. భగవంతుని దివ్య మహాప్రసాదాన్ని అన్నబ్రహ్మ రూపంలో పూజిస్తారని తెలిపింది. దీంతో నేలపై కూర్చొని మహాప్రసాదం తినే ఆచార సంప్రదాయం అనాది కాలంగా ఉందని స్పష్టం చేసింది. ఆలయ సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించవద్దని పూరీలోని హోటళ్ళు, రిసార్ట్‌లకు సూచించింది. అలాగే నైవేద్యం పవిత్రతను గౌరవించాలని, ఆలయ సంప్రదాయాన్ని ఉల్లంఘించవద్దని భక్తులను కోరింది.
వీడియో చూడండి:
ଭିଡ଼ିଓ ରେ ଦେଖନ୍ତୁ ସେ ହୋଟେଲର କର୍ମଚାରୀ ମନା କରିବା ସତ୍ତ୍ବେ ସେମାନେ କିପରି ଡାଇନିଂ ଟେବୁଲ ଉପେର ମହାପ୍ରସାଦ ବାଢ଼ି ଗୋଡ଼ ହଲେଇ ମୋବାଇଲ ଚଲାଇ ପାଉଛନ୍ତି..ଆଉ ତହୁଁ ବଡ଼ ସେ ବ୍ରାହ୍ମଣ ମହାଶୟ ଯିଏ ମହାପ୍ରସାଦ ତାଙ୍କୁ ବାଢ଼ିକି ଦେଇଛନ୍ତି।ଆଉ ସେ ଦାଢ଼ିଆ ବାବା ସବୁ ଦେଖି ମଧ୍ଯ ଚୁପ ହୋଇ ଠିଆ ହୋଇଛନ୍ତି।ଦୋଷ କାହାକୁ ଦେବେ? pic.twitter.com/ktH4KLpTkd
— 🦋šrαdhα🦋 (@princess_sradha) May 16, 2025
