Petrol Prices: వాహనదారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. తగ్గిన పెట్రోల్‌, డీజీల్‌ ధరలు..

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై రూ. 2 తగ్గిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హర్జిత్ సింగ్ పూరి ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ప్రకటించారు. తగ్గించిన ఈ ధరలు...

Petrol Prices: వాహనదారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. తగ్గిన పెట్రోల్‌, డీజీల్‌ ధరలు..
Petrol Price

Edited By:

Updated on: Apr 05, 2024 | 3:02 PM

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై రూ. 2 తగ్గిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హర్జిత్ సింగ్ పూరి ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ప్రకటించారు. తగ్గించిన ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే దేశంలో పెట్రోల్‌, డీజీల్‌ ధరలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తొలి నుంచి చేపడుతోన్న చర్యలను వివరిస్తూ సుదీర్ఘంగా పోస్ట్ చేశారు.

కేంద్ర మంత్రి ట్వీట్ చేస్తూ.. కష్టకాలంలో ప్రపంచ దేశాలు చమురు ధరలను 50 నుంచి 72 శాతం పెంచాయని. అయితే భారత దేశంలో మాత్రం ధరలు పెరగకపోగా ఈ రెండేళ్లలో 4.65 శాతం తగ్గాయని తెలిపారు. గతంలో భారతీయుల అవసరాల కోసం చమురును కేవలం 27 దేశాల నుంచే కొనుగోలు చేసేవాళ్లమని, కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ పరిధిని విస్తరించి 39 దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

మార్చి 14, 2024న భారతదేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర సగటున రూ. 94 అయితే ఇటలీలో రూ. 168.01 (మన కరెన్సీలో) అంటే 79 శాతం అధికం. అలాగే ఫ్రాన్స్‌లో రూ. 166.87 అంటే 78 శాతం అధికం, అలాగే జర్మనీలో రూ. 159.57 అంటే 70 శాతం అధికం, ఇక స్పెయిన్‌లో రూ. 145.13 భారత్‌తో పోల్చితే 54 శాతం ఎక్కువ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. ఇక డీజీల్‌ ధర విషయానికొస్తే.. భారత్‌లో సగటున లీటర్‌ డీజిల్‌ ధర రూ. 87 అయితే, ఇటలీలో రూ. 163.21, ఫ్రాన్స్‌లో 161.57, జర్మీనీలో రూ. 155.68, స్పెయిన్‌లో రూ. 138.05గా ఉందని మంత్రి రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us