Gyanvapi Masjid Case: జ్క్షానవాపి మసీదు కేసులో కోర్టు కీలక నిర్ణయం.. కమిటీ సభ్యుడు అజయ్‌ మిశ్రాపై వేటు..

|

May 17, 2022 | 5:23 PM

సర్వే నివేదికను కోర్టు అనుమతి లేకుండా లీక్‌ చేయడంతో అజయ్‌మిశ్రాపై వేటు పడింది. కమిటీ జరిపిన సర్వే నివేదికను లీక్ చేస్తన్నందునే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

Gyanvapi Masjid Case: జ్క్షానవాపి మసీదు కేసులో కోర్టు కీలక నిర్ణయం.. కమిటీ సభ్యుడు అజయ్‌ మిశ్రాపై వేటు..
Gyanvapi
Follow us on

జ్క్షానవాపి మసీదులో(Gyanvapi Masjid ) సర్వే జరిపిన కోర్టు కమిషనర్‌ అజయ్‌ మిశ్రాను వారణాసి న్యాయస్థానం తొలగించింది. సర్వే నివేదికను కోర్టు అనుమతి లేకుండా లీక్‌ చేయడంతో అజయ్‌మిశ్రాపై వేటు పడింది. కమిటీ జరిపిన సర్వే నివేదికను లీక్ చేస్తన్నందునే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అజయ్ మిశ్రా ఓ ప్రైవేట్ కెమెరా మెన్‌ని పెట్టుకుని సర్వే రిపోర్టును మీడియాకు లీక్ చేశారని ఆరోపించారు. అయితే.. మరో ఇద్దరు కోర్టు కమిషనర్లు మాత్రం సర్వే బృందంలో కొనసాగుతారని వెల్లడించింది.  జ్ఞానవాపి మసీదులో శివలింగం లభించిన ప్రదేశాన్ని సీల్‌ చేయడంపై సుప్రీంకోర్టు వాడివేడి వాదనలు జరిగాయి. శివలింగం లభించిన ప్రాంతాన్ని తగిన రక్షణ ఏర్పాటు చేయాలని జిల్లా మెజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీచేసింది. శివలింగం దగ్గర గట్టి భద్రత ఏర్పాటు చేయాలని సూచించింది. అదే సమయంలో ముస్లింలను నమాజ్‌ చేసుకోవడానికి అనుమతించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ వ్యవహారంపై రేపు వాదనలు విన్పిస్తారు. జ్ఞానవాపి మసీదు వివాదంపై వాదనలు విన్పించడానికి యూపీ ప్రభుత్వం రేపటి వరకు గడువును కోరింది. జ్క్షానవాపి మసీదుపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ నరసింహ నేతృత్వం లోని బెంచ్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది. తాము అన్నిపక్షాల వాదనలు వింటామని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

జ్క్షానవాపి మసీదులో సర్వే జరిపిన కోర్టు కమిషనర్‌ అజయ్‌మిశ్రాను వారణాసి న్యాయస్థానం తొలగించింది. సర్వే నివేదికను కోర్టు అనుమతి లేకుండా లీక్‌ చేయడంతో అజయ్‌మిశ్రాపై వేటు పడింది. అయితే మరో ఇద్దరు కోర్టు కమిషనర్లు మాత్రం సర్వే బృందంలో కొనసాగుతారు.