Gulab Cyclone Effect: గులాబ్ తుఫాను ప్రభావంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గులాబ్ తుపాన్ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు, కొన్నింటిని రైల్వే శాఖ దారి మళ్లించింది. కొన్నింటి గమ్యస్థానాలను కుదించారు. రెండు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచే పలు రైళ్లను రద్దు కాగా, మరి కొన్ని రైళ్లను మళ్లించారు. 27న విశాఖలో బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్రత్యేక రైలును జగదల్‌పూర్‌లో నిలిపేయడంతోపాటు తిరుగు ప్రయాణంలో ఈనెల 28న జగదల్‌పూర్ నుంచి బయలు దేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే జునాగర్ రోడ్ – భువనేశ్వర్, గునుపూర్ – రూర్కెలా రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ.
అలాగే భువనేశ్వర్-సికింద్రాబాద్, భువనేశ్వర్- తిరుపతి, పూరీ-చెన్నై సెంట్రల్, సంబల్‌పూర్-హెచ్‌ఎస్ నాందేడ్, రాయగూడ-గుంటూరు, భువనేశ్వర్-కేఎస్‌ఆర్ బెంగుళూరు సిటీ, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరికొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
08463 భువనేశ్వర్ నుండి బెంగళూరు ప్రశాంతి స్పెషల్.
02845 భువనేశ్వర్ నుండి భువనేశ్వర్-యశ్వంతపూర్ స్పెషల్.
08969 భువనేశ్వర్ నుండి భువనేశ్వర్-విశాఖపట్నం స్పెషల్.
08570 విశాఖపట్నం నుండి విశాఖపట్నం-భువనేశ్వర్ స్పెషల్.
02071 భువనేశ్వర్ నుండి భువనేశ్వర్-తిరుపతి స్పెషల్.
08417 పూరి నుండి పూరి-గుణుపూర్ స్పెషల్.
02859 పూరి నుండి పూరి-చెన్నై సెంట్రల్ స్పెషల్.
08521 గుణపూర్ నుండి గురుపూర్-విశాఖపట్నం స్పెషల్.
08522 విశాఖపట్నం నుండి విశాఖపట్నం-గుణుపూర్ స్పెషల్.
08433 భువనేశ్వర్ నుండి భువనేశ్వర్-పలాస స్పెషల్.
08572 విశాఖపట్నం నుండి విశాఖపట్నం-టాటా స్పెషల్.
08518 విశాఖపట్నం నుండి విశాఖపట్నం-కోర్బా స్పెషల్.
08517 కోర్బా నుండి కోర్బా-విశాఖపట్నం స్పెషల్.
02085 సంబల్పూర్ నుండి సంబల్పూర్-నాందేడ్ స్పెషల్.
08527 రాయపూర్ నుండి రాయపూర్-విశాఖపట్నం స్పెషల్.
08528 విశాఖపట్నం నుండి విశాఖపట్నం-రాయపూర్ స్పెషల్.
08508 విశాఖపట్నం నుండి విశాఖపట్నం-రాయగడ స్పెషల్.
07244 రాయగడ నుండి రాయగడ -గుంటూరు స్పెషల్.
02072 తిరుపతి నుండి తిరుపతి-భువనేశ్వర్ స్పెషల్.
08418 గుణుపూర్ నుండి గుణుపూర్-పూరి స్పెషల్.
02860 చెన్నై నుండి చెన్నై-పూరి స్పెషల్.
08434 పలాస నుండి పలాస-భువనేశ్వర్ స్పెషల్.
02086 నాందేడ్-సంబల్పూర్ స్పెషల్.
08507 రాయగడ నుండి విశాఖపట్నం స్పెషల్.
08464 బెంగళూరు నుండి భువనేశ్వర్ ప్రశాంతి స్పెషల్.
02846 యశ్వంత్పూర్ నుండి భువనేశ్వర్ స్పెషల్.
Cancellation/Diversion of Trains due to Cyclone “GULAB” @drmvijayawada @drmgtl @drmgnt pic.twitter.com/oRcW5l4xJk
— South Central Railway (@SCRailwayIndia) September 26, 2021