దేశవ్యాప్తంగా పలు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు, చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో సర్దార్ సరోవర్ డ్యామ్ గేట్లను మొట్టమొదటిసారి పైకి ఎత్తారు. డ్యామ్‌లో నీటిమట్టం 131 మీటర్లకు చేరుకోవడంతో 30 గేట్లలో 22 గేట్లు తెరిచినట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. ప్రస్తుతం 96 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో వరద నీరు లోతట్టు ప్రాంతాలను జలమయం చేసింది. దీనివల్ల పలు గ్రామాలు నీటముగినిపోయాయి. దీని ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం యంత్రాంగం అన్ని ఏర్పాట్ల చేసింది.