Wedding Function: ఎంతో సంతోషంగా వివాహ వేడుక జరిగింది. ఆ వేడుకలో వధూవరుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలో అపశ్రుతి చోటు చేసుకుంది. వివాహ వేడుకలో విందు తిన్న అతిధులు అనారోగ్యానికి గురయ్యారు. ఈ దారుణ ఘటన గుజరాత్(Gujarat) లో చోటు చేసుకుంది. మెహ్‌సనా జిల్లా( Mehsana District) లోని విస్‌నగర్ తాలుకా సవాలా గ్రామంలో కాంగ్రెస్ నేత( Congress leader) కుమారుడి వివాహం ఘనంగా జరిగింది.పెళ్లి వేడుకక్కి భారీ అతిధులు హాజరయ్యారు. విందు భోజనం ఘనముగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో విందు ఆరగించిన అతిధుల్లో 1,200 మందికిపైగా అస్వస్థకు గురయ్యారు. వెంటనే బాధితులను సమీపంలోని వివిధ ఆస్పత్రికి తరలించారు. చికిత్సనందిస్తున్నారు.
కలుషిత ఆహారం తినడం వల్లే వీరంతా అనారోగ్యానికి గురయ్యారని మెహసానా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పార్థరాజ్‌సింగ్ గోహిల్ తెలిపారు. విందు తిన్న కొంతమందికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో బాధితులను విస్‌నగర్, మెహసానా, వాద్‌నగర్‌లోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఫంక్షన్‌లో వడ్డించిన ఆహారం శాంపిల్స్ ను పరీక్షల కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ, ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ వారు సేకరించినట్లు చెప్పారు. ఫుడ్ అండ్ డ్రగ్ శాఖ సైతం ఈ ఘటనపై విచారణ చేపట్టిందన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
స్థానిక కాంగ్రెస్ నేత కుమారుడి వివాహానికి చాలా మంది హాజరవగా.. విందులో శాఖాహారంతో పాటు మాంసాహారం సైతం సరఫరా చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘వివాహ విందులో భాగంగా మాసాన్ని వడ్డించారు. ఆ మాసం తిన్న తర్వాత 1,200 మందికి పైగా అతిథులు బాధితులుగా మారారు. చాలా మంది వాంతులు , విరేచనాలతో డయేరియా వంటి సమస్యలు తలెత్తాయి.
Also Read: