Building collapses: నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం.. లిప్ట్ కూలి ఏడుగురు కార్మికులు దుర్మరణం..

పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లిన కూలీలను లిఫ్ట్‌ మింగేసింది. ఏడంత‌స్తుల భ‌వ‌నం నిర్మాణంలో ఉండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. నిర్మాణంలో ఉన్న భవనం..

Building collapses: నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం.. లిప్ట్ కూలి ఏడుగురు కార్మికులు దుర్మరణం..
Under Construction Building

Updated on: Sep 14, 2022 | 1:31 PM

Building collapses: ఇదో విషాద సంఘటన.. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లిన కూలీలను లిఫ్ట్‌ మింగేసింది. ఏడంత‌స్తుల భ‌వ‌నం నిర్మాణంలో ఉండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్ట్ కూలిపోవడంతో ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన గుజరాత్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనానికి ఆస్పైర్-2 అని పేరు పెట్టారు. ఇది గుజరాత్ విశ్వవిద్యాలయం సమీపంలో ఉంది. భవనంలోని ఏడో అంతస్తు నుంచి లిఫ్ట్‌ కూలిపోవడంతో మరో కార్మికుడు తీవ్రంగా గాయపడినట్టుగా తెలిసింది.

ఈ ఘోర ప్రమాదంలో సంజయ్‌భాయ్‌ బాబూభాయ్‌ నాయక్‌, జగదీష్‌భాయ్‌ రమేష్‌భాయ్‌ నాయక్‌, అశ్విన్‌భాయ్‌ సోంభాయ్‌ నాయక్‌, ముఖేష్‌ భరతభాయ్‌ నాయక్‌, ముఖేష్‌భాయ్‌ భరతభాయ్‌ నాయక్‌, రాజ్‌మల్‌ సురేశ్‌భాయ్‌ ఖరాడీ, పంకజ్‌భాయ్‌ శంకర్‌భాయ్‌ ఖరాడి అనే ఏడుగురు కార్మికులు చనిపోయినట్టుగా తెలిసింది. అధికారులు..పోలీసులు సంఘ‌ట‌నాస్థలికి చేరుకున్నారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి