AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Results 2022: గుజరాత్‌లో పోటీ వీరి మధ్యే..! హిమాచల్‌లో మాత్రం హోరా హోరీ.. ఫలితాలపై ఉత్కంఠ

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మరి ఈ ఫలితాల విషయంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజం కానున్నాయా? లేక ఏవైనా తారుమారు జరిగే అవకాశముందా? ఆ ఫుల్ డీటైల్స్..

Assembly Election Results 2022: గుజరాత్‌లో పోటీ వీరి మధ్యే..! హిమాచల్‌లో మాత్రం హోరా హోరీ.. ఫలితాలపై ఉత్కంఠ
Gujarat Himachal Pradesh Assembly Election Results (2)
Sanjay Kasula
|

Updated on: Dec 08, 2022 | 8:04 AM

Share

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో నవంబర్ 12న ఒకే దశలో ఎన్నికలు జరగ్గా.. గుజరాత్ లో మాత్రం డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించారు. గుజరాత్ లో తిరిగి అధికారం చేపట్టేది.. బీజేపీ అంటూ అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్. రెండూ మూడు స్థానాల్లో కాంగ్రెస్, ఆప్ ఉంటాయని చెబుతున్నాయీ అంచనాలు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉందని అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఎనిమిదింటి నుంచి కౌంటింగ్ స్టార్ట్ కానుంది. సాయంత్రం నాటికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.

గుజరాత్ ఓటరు ఎవరి వైపు..

గుజరాత్ ను బీజేపీ గత 27 ఏళ్లుగా పాలిస్తోంది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు ఆప్ సైతం పార్టిసిపేట్ చేయడంతో త్రిముఖ పోటీ నెలకొంది.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అటుంచితే.. ఏయే పార్టీకి ఎన్నేసి స్థానాలొస్తాయి. ఆప్ ఎంట్రీతో ఎలాంటి స్థానాలు ఏయే పార్టీలు చేయి జారనున్నాయి? అన్న ఉత్కంఠ నెలకొని ఉంది.

గుజరాత్ లో మొత్తం 33 జిల్లాల్లోని 182 అసెంబ్లీ స్థానాలు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 92. రెండు దశల్లో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలలో 64.30 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. తగ్గిన ఓటింగ్ శాతం ప్రధాన పార్టీలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. 2017లో గుజరాత్‌లో జరిగిన రెండు దశల పోలింగ్‌లో మొత్తం 68 శాతం ఓటింగ్ నమోదైంది. అప్పటితో పోలిస్తే.. 4 శాతం తక్కువ నమోదు కావడంపై ఆందోళన నెలకొంది. తగ్గిన ఓటింగ్ శాతంపై ఇప్పటికే బీజేపీ ఓ సమావేశం ఏర్పాటు చేసి మరీ విశ్లేషించుకుంది. ఎగ్జిట్ పోల్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నా.. సమగ్రంగా చర్చించింది గుజరాత్ కమలదళం.

హిమాచల్ హిమవంతులు ఎవరిని కరుణిస్తారు..

ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్‌ విషయానికి వస్తే.. మొత్తం 68 స్థానాలున్న ఈ రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో అధికారం పొందాలంటే కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 35. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి హోరాహోరీ పోరు జరిగిందని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ జరిగింది. ఆప్ గట్టి పోటీ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఇక రెండు ప్రధాన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నిక ఫలితాలు సైతం ఉత్కంఠ రేపుతున్నాయి.

ఇక హిమాచల్ ప్రదేశ్ లో గత సంప్రదాయం కొనసాగనుందా? లేక బీజేపీ మరోమారు అధికారం సొంతం చేసుకోనుందా? లేక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? అన్న సస్పెన్స్ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పాటు ఆప్ కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి రేకెత్తుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం