దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, మణిపూర్ రాష్ట్రాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలతో ఊర్లకు ఊర్లే చెరువులను తలపిస్తున్నాయి. గుజరాత్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్‌లో గడిచిన కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వల్సాడ్ ఒక్క రాత్రే 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూరత్‌లో తాపి నది ప్రమాదకరస్థాయి దాటి ప్రవాహిస్తోంది. మరోవైపు పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో ఫ్లైఓవర్ల కింద దాదాపు మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. డ్రైనేజీలు తెరుచుకొని ఉంటాయనే భయంతో వాహనదారులు ముందుకు కదలడం లేదు. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. వరద ధాటికి గుజరాత్‌లోని పలు జలపాతాలకు వరద నీరు పోటెత్తింది.
గుజరాత్‌లో భారీ వర్షాలు.. వీడియో
#WATCH | Gujarat: Flood-like situation in the Navsari as the district continues to experience heavy rainfall. https://t.co/1ljsFyT0hb pic.twitter.com/2Zo9DV2XdA
— ANI (@ANI) August 25, 2024
ఇక మణిపూర్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో చాలా మంది సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అక్కడ కూడా వాళ్లున్న ప్రాంతాన్ని నీళ్లు చుట్టుముట్టాయి. దాదాపు 130 కుటుంబాలు ఈ సహాయ శిబిరంలో తలదాచుకుంటున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే అక్కడ మరిన్ని ఇళ్లు నీట మునిగే ముప్పు ఉంది. వాగువంకలు ఉధృతంగా ప్రవహించడంతో పలుప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్ల లోకి వరదనీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు బయటకు పోయేందుకు ఎలాంటి మార్గం లేదని స్థానికులు తల్లడిల్లుతున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర సరుకులకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో వరుణులు ప్రతాపం చూపిస్తున్నాడు. అక్కడి ఫోయ్‌సాగర్ సరస్సు పొంగి పొర్లుతోంది. చెరువులో భారీగా నీళ్లు చేరాయని తెలియగానే చాలా మంది ఆ దృశ్యాన్ని చూసేందుకు వచ్చారు. ఏడారి రాష్ట్రంలో నీళ్లకు ఇక కొరత లేకుండా పోయిందని సంతోషం వ్యక్తం చేశారు.
భారీ వర్షాలు వీడియో చూడండి..
ఆ రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్..
మరోవైపు రాబోయే 24 గంటలు దేశంలోని పలు రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్ రాష్ట్రానికి ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, ఢిల్లీతో సహా ఈశాన్య రాష్ట్రాలను హెచ్చరించింది. ఆయా రాష్ట్రాలకు రెడ్, ఆరంజ్, ఎల్లో అలెర్ట్ లు జారీ చేసింది. ఇక రాగల మూడు రోజులపాటు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రంవెల్లడించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్ నుంచి బంగాళాఖాతం వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ఒడిశాలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు ఒడిశాలోని ఉత్తరాది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీచేసింది.