ఇకపై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే E-FIR నమోదు చేసుకోవచ్చు.. స్మార్ట్‌ఫోన్‌, బైక్‌ చోరీ బాధితుల కోసం..

|

Jun 09, 2022 | 11:34 AM

E-FIR: 'బస్సులో వెళుతుంటాం ఉన్నట్టుండి ఎవరో దొంగ జేబులోని స్మార్ట్ ఫోన్‌ దొంగలిస్తాడు. ఇంటి ముందు పార్క్‌ చేసిన బైక్‌ను కేటుగాళ్లు కొట్టేస్తారు' ఇలాంటి చేదు సంఘటనలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి...

ఇకపై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే E-FIR నమోదు చేసుకోవచ్చు.. స్మార్ట్‌ఫోన్‌, బైక్‌ చోరీ బాధితుల కోసం..
E Fir
Follow us on

E-FIR: ‘బస్సులో వెళుతుంటాం ఉన్నట్టుండి ఎవరో దొంగ జేబులోని స్మార్ట్ ఫోన్‌ దొంగలిస్తాడు. ఇంటి ముందు పార్క్‌ చేసిన బైక్‌ను కేటుగాళ్లు కొట్టేస్తారు’ ఇలాంటి చేదు సంఘటనలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అయితే వస్తువు పోయిందని బాధ పడాలో, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడాలో తెలియని పరిస్థితి వస్తుంది. సాధారణంగా పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటే ఫిజికల్‌గా స్టేషన్‌కు వెళ్లి, లెటర్‌ రాసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా పెద్ద తతంగంతో కూడుకున్న అంశం. అయితే అలా కాకుండా ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ! ఇలాంటి ఆలోచనే చేసింది గుజరాత్‌ ప్రభుత్వం.

ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఈ-ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. స్మార్ట్‌ఫోన్‌, బైక్‌ దొంగతనాలకు సంబంధించిన బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ విషయమై గుజరాత్‌ సమాచార విభాగం ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘సిటిజెన్‌ ఫస్ట్‌’ మొబైల్‌ యాప్‌ ద్వారా బాధితులు పోలీస్‌లకు ఫిర్యాదు చేసుకోవచ్చు. http://gujhome.gujarat.gov.in వెబ్‌సైట్‌ లేదా సిటిజెన్‌ ఫస్ట్‌ మొబైల్‌ యాప్‌ను ఉపయోగించి ఈ-ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకోవచ్చు. దొంగతనం చేసిన వ్యక్తి ఎవరో తెలియని సందర్భాల్లో, దొంగతనం జరిగిన సమయంలో బాధితుడికి ఎలాంటి గాయాలు కానప్పుడే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది.

48 గంటల్లో స్పందించకపోతే.. 

ఇవి కూడా చదవండి

దొంగతనానికి సంబంధించి పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించిన తర్వాత ఈ-ఎఫ్‌ఐఆర్‌ను, సాధారణ ఎఫ్‌ఐర్‌గా మారుస్తారు. ఈ-ఎఫ్‌ఐఆర్‌లపై పోలీసు అధికారులు సరైన రీతిలో స్పందించకపోతే వారిపై తగిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. బాధితుడు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసిన 48 గంటల్లో పోలీసు అధికారులు కచ్చితంగా స్పందించి, నేరం జరిగిన చోటును సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..