Gujarat Fire Accident: గుజరాత్‌లోని వల్సాద్‌లోని పేపర్ మిల్లులో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 20 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అగ్నిమాపక శాఖ అధికారి అంకిత్ లోథే తెలిపారు. సుమారు 5 గంటల నుంచి మంటలు భారీస్థాయిలో ఎగసిపడుతుండగా.. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఇంకా ఎంత సమయపం పడుతుందనే చెప్పలేమన్నారు. కాగా, అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగకున్నప్పటికీ.. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కాగా, దీపావళి పర్వదినాన అందరూ పూజా క్రతువుల్లో నిమగ్నమై ఉండగా.. ఒక్కసారిగా పేపర్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించడం స్థానికంగా పెను కలకలం సృష్టించింది. ఈ ఆకస్మిక ప్రమాదంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంకా అదృష్టం ఏంటంటే.. సెలవు దినం కావడంతో పేపర్ మిల్లులో సిబ్బంది ఎవరూ లేరు. దాంతో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.
Also read:
Bribe Case: యూనిఫాం తీసేసి ఎస్‌ఐ పరుగో పరుగు.. ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు.. అసలేమైందంటే..?
Diwali Celebrations: సరోజినీ కంటి ఆస్పత్రికి బాధితుల తాకిడి.. ఇప్పటివరకు 32 కేసులు నమోదు..