అద్దె ఇంట్లో ఐదు మృతదేహాలు..! ముగ్గురు చిన్నారులు సహా విగత జీవులుగా మారిన దంపతులు

అహ్మదాబాద్‌లోని బావ్లా తాలూకాలో ఒక అద్దె ఇంట్లో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. 34 ఏళ్ల విపుల్ వాఘేలా, అతని భార్య సోనాల్, ముగ్గురు పిల్లలు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు.

అద్దె ఇంట్లో ఐదు మృతదేహాలు..! ముగ్గురు చిన్నారులు సహా విగత జీవులుగా మారిన దంపతులు
Ambulance

Updated on: Jul 20, 2025 | 11:47 AM

ఓ అద్దె ఇంట్లో ఐదు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు విషం తాడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని బావ్లా తాలూకాలో చోటు చేసుకుంది. శనివారం (జూలై 19) రాత్రి వీరంత విషయం సేవించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఎవరు బయటికి రాకపోవడం పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే చూసే సరికి ముగ్గురు చిన్నారలతో సహా దంపతులు విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మృతులను విపుల్ కాంజీ వాఘేలా (34), అతని భార్య సోనాల్ (26), వారి ముగ్గురు పిల్లలు 11, 5 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు, 8 సంవత్సరాల కుమారుడుగా గుర్తించారు. వీరి స్వస్థలం గుజరాత్‌లోని సమీప పట్టణమైన ధోల్కాగా పోలీసులు గుర్తించారు. విపుల్ కంజీభాయ్ వాఘేలా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోనాల్ విపుల్భాయ్ వాఘేలా గృహిణి. కరీనా అలియాస్ సిమ్రాన్ విపుల్భాయ్ వాఘేలా, మయూర్ విపుల్భాయ్ వాఘేలా, యువరాజు విపుల్‌భాయ్ వాఘేలా చదువుకుంటున్నారు.

ఈ కుటుంబం మొదట ధోల్కాలోని బార్కోతలోని దేవిపూజక్ వాస్ ప్రాంతానికి చెందినది , కొంతకాలంగా బాగోద్రలో నివసిస్తున్నారు. విపుల్ వాఘేలా తన కుటుంబాన్ని పోషించడానికి ఆటో రిక్షా నడుపుతూ జీవనోపాధి పొందేవాడు. విషం తాగి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, సామూహిక ఆత్మహత్య వెనుక గల కారణం ఇంకా తెలియరాలేదు. ఇప్పటివరకు ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. కానీ, ఆర్థిక ఒత్తిడి కారణంగానే కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పిల్లలకు విషం ఇచ్చి తర్వాత దంపతులు విషం తాగినట్లు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి