Gujarat AAP vs BJP: గుజరాత్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీకి షాక్‌.. నామినేషన్ ఉపసంహరించుకున్న కీలక అభ్యర్థి..

|

Nov 17, 2022 | 11:41 AM

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. సూరత్‌ ఈస్ట్‌ నుంచి ఆప్‌ అభ్యర్ధి కాంచన్‌ జరీవాలా నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.

Gujarat AAP vs BJP: గుజరాత్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీకి షాక్‌.. నామినేషన్ ఉపసంహరించుకున్న కీలక అభ్యర్థి..
Surat East Candidate Kanchan Jariwala
Follow us on

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. సూరత్‌ ఈస్ట్‌ నుంచి ఆప్‌ అభ్యర్ధి కాంచన్‌ జరీవాలా నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. అయితే బీజేపీ బెదిరింపులతోనే తమ అభ్యర్ధి నామినేషన్‌ వెనక్కి తీసుకున్నారని, ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆప్‌ డిమాండ్‌ చేసింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిక వేళ బీజేపీపై ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. సూరత్‌ ఈస్ట్‌ నుంచి తమ అభ్యర్ధి కాంచన్‌ జరీవాలాను బీజేపీ కిడ్నాప్‌ చేసి.. బలవంతంగా నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చేశారని ఆప్‌ ఆరోపించింది. నిన్న కిడ్నాపైన కాంచన్‌ను 500 మంది పోలీసులు బలవంతంగా ఈసీ ఆఫీస్‌కు తీసుకొచ్చి నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్టు ఆప్‌ ఆరోపించింది.

ఈసీ ప్రధాన కార్యాలయం ముందు మనీష్‌ సిసోడియా ధర్నా..

ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ధర్నా చేపట్టారు. భారత చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదని, ఎన్నికల సంఘం వెంటనే బీజేపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సూరత్‌ ఈస్ట్‌లో ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 24 గంటల్లో ఆప్‌ అభ్యర్ధి మాట మార్చడం వెనుక బీజేపీ కుట్ర ఉందన్నారు.

బీజేపీ నుంచి ఒత్తిడి లేదు..

అయితే తాను స్వచ్ఛందంగానే నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్టు కాంచర్‌ జరీవాలా తెలిపారు. బీజేపీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. అంతేకాదు.. ఆప్‌ దేశద్రోహుల పార్టీ అని, గుజరాతీలకు వ్యతిరేకమంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంచర్ జరీవాలా.

ఇవి కూడా చదవండి

మరోవైపు గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గట్‌లోడియా నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు సీఎం భూపేంద్ర పటేల్‌ . కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు రోడ్‌షోలో పాల్గొన్న తరువాత నామినేషన్‌ వేశారు భూపేంద్రపటేల్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..