Gujarat Civic Polls Results: కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. మళ్లీ ఆరుకు ఆరు కైవసం..

|

Feb 24, 2021 | 8:05 AM

Gujarat Civic Polls Results: గుజరాత్‌ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. గుజరాత్‌లో ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో ఆరు మునిసిపల్‌..

Gujarat Civic Polls Results: కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. మళ్లీ ఆరుకు ఆరు కైవసం..
Follow us on

Gujarat Civic Polls Results: గుజరాత్‌ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. గుజరాత్‌లో ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో ఆరు మునిసిపల్‌ కార్పొరేషన్లను కూడా మళ్లీ కైవసం చేసుకోని సత్తా చాటింది. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్ కార్పొరేషన్లల్లో ఉన్న మొత్తం 576 సీట్లల్లో 483 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 55 స్థానాల్లో, ఆప్‌ 27 స్థానాల్లో, ఇతరులు 10 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. ఈ నెల 21న.. అహ్మదాబాద్‌లో 192, రాజ్‌కోట్‌లో 72, జామ్‌నగర్‌లో 64, భావ్‌నగర్‌లో 52, వడోదరలో 76, సూరత్‌లో 120 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

మళ్లీ ఆరు కార్పోరేషన్లను బీజేపీ కైవసం చేసుకోని తన బలాన్ని నిరూపించుకుంది. అయితే.. సూరత్‌లో కాంగ్రెస్‌ ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు. కాగా.. తమకు భారీ విజయాన్నిందించినందుకు ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ తమ ఆయా కార్పోరేషన్ల పరిధిలోని ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఫలితాలను ప్రత్యేకమైనవిగా అభివర్ణిస్తూ.. ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read:

Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢికొన్న ట్యాంకర్.. ఏడుగురు మృతి

రెండో రోజుకు జేఈఈ మెయిన్ పరీక్ష.. మైనస్‌ మార్కులు తొలగించడంతో పాటు ఆప్షన్లు.. విద్యార్థులకు తగ్గిన ఒత్తిడి..!