రాజకీయ నాయకులు రాసీలీల్లో మునిగితేలడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకుంటే మనం పొరబడినట్లే. జాతీయ రాజకీయాల్లోనూ ఇలాంటి మహానుభావులు ఉన్నారు. తాజాగా గుజరాత్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే ఇలాగే మహిళలతో పట్టుబడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే భూపత్ భయానీ ఓ మహిళతోహోటల్‌లో దొరికిపోయాడు. ఈ సంఘటన సూరత్‌లోని కడోదరలోని సూరజ్ హోటల్‌లో జరిగింది. ఎమ్మెల్యేతో పాటు సదరు మహిళ రిసెప్షన్‌లో చెక్‌ఇన్ చేస్తున్న సమయంలో సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యేకు, మహిళకు మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అనంతరం ఎమ్మెల్యే సదరు మహిళతో కలిసి గదిలోకి వెళ్లారు.
AAP MLA Bhupat Bhayani was caught in a Surat hotel with a girl. In the viral CCTV footage of a hotel in Kadodara, near Surat, AAP MLA Bhupat Bhayani was seen with the girl in a hotel room.#surat #oursuratcity pic.twitter.com/JjmXDkkT0K
— Our Surat (@oursuratcity) June 22, 2023
అయితే అదే సమయంలో ఊహించని సంఘటన ఎదురైంది. ఎమ్మెల్యేతో ఉన్న సమయంలో సదరు మహిళ భర్త హోటల్‌కు చేరుకున్నాడు. దీంతో ఎమ్మెల్యే, మహిళ ముఖం కనిపించకుండా మాస్క్‌ను ధరించి అక్కడి నుంచి పారిపోయారు. ఇది కూడా హోటల్ కారిడార్‌లో ఉన్న సీసీటీవీలో ఇదంతా రికార్డ్ అయ్యింది. ఇదిలా ఉంటే మహిళ భర్త తమ వైవాహిక జీవితాన్ని కాపాడుకునే క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ సంఘటనపై ఆప్ ఎమ్మెల్యే స్పందించడానికి నిరాకరించడం గమనార్హం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..