మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానుషం… చికిత్స కోసం వచ్చిన మహిళను ఈడ్చుకెళ్లిన సెక్యూరిటీ గార్డు..!

| Edited By: Pardhasaradhi Peri

Feb 21, 2021 | 9:37 AM

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళను అతి దారుణంగా ఈడ్చుకెళ్లాడు ఓ కసాయి సెక్యూరిటీ గార్డు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానుషం... చికిత్స కోసం వచ్చిన మహిళను ఈడ్చుకెళ్లిన సెక్యూరిటీ గార్డు..!
Follow us on

Dragging Woman Out : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళను అతి దారుణంగా ఈడ్చుకెళ్లాడు ఓ కసాయి సెక్యూరిటీ గార్డు. ఇలా దాదాపు 300 మీటర్ల దూరంలో బురద నీటిలో లాగి ఆసుపత్రి ప్రాంగణం బయట పడేశాడు. ఇందుకు సంబంధించి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. దీంతో స్పందించిన ఆసుపత్రి ఉన్నతాధికారులు ఆ వ్యక్తిని విధుల నుంచి తొలగించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్గోన్ పట్టణంలో జరిగింది.

ఖార్గోన్ ప్రభుత్వ ఆసుపత్రికి మానసికస్థితి సరిగా లేని ఓ మహిళ చికిత్స కోసం వచ్చింది. ఆసుపత్రి అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఎవరో ఆమెను వదిలివేసి వెళ్లారు. తనకు చికిత్స చేయాలంటూ వైద్య సిబ్బందిని ఆ మహిళ వేడుకుంది. ఆమెకు సంబంధించి వివరాలు సరిగాలేకపోవడంతో వైద్యాధికారులు చికిత్స చేసేందుకు నిరాకరించారు. పైగా, ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లమని సెక్యూరిటీ గార్డుకు చెప్పారు. దీంతో అతను మహిళను వెళ్లిపోవాలని చెప్పినప్పటికీ ప్రధాన గేట్ వద్దే కూర్చోని ఉండిపోయింది. ప్రవేశద్వారం వద్ద వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉందని భావించిన సెక్యూరిటీ గార్డు ఆమెను నీటి బుదరలో నుంచే ఈడ్చుకెళ్లారు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ చిత్రాలు వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు సదరు సెక్యూరిటీ గార్డును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also… Bird Flu: షాకింగ్‌ న్యూస్‌.. మనుషులకూ బర్డ్‌ ఫ్లూ.. మొదటి కేసు గుర్తించిన వైద్య నిపుణులు.. ఎక్కడంటే..