జీఎస్టీ (వస్తుసేవల పన్ను) ఈ పదం దేశ ప్రజలను.. కాస్త ఆశ్చర్యానికి.. అయోమయానికి గురి చేసింది. దాదాపు మనం ఉపయోగించే అన్ని రకాల వస్తువులపై.. కేంద్రం జీఎస్టీ విధించింది. మోదీ జీఎస్టీ అమలును తీసుకొచ్చినప్పుడు దేశంలో పెద్దఎత్తున తిరుగుబాటు లేచింది. దీంతో.. ప్రజలు కట్టిన ట్యాక్స్ నేరుగా.. దేశీయ ఖజానాకు చేరుకుంటుందని మోదీ ఉద్ధేశ్యం. ఇది ఒకందుకు మంచిదైనా.. ప్రజలపై భారీగానే భారం పడింది. బట్టలు దగ్గరనుంచీ.. బంగారం, పెట్రోలు… ఇలా ఏ చిన్న వస్తువు కొన్నా దానిపై జీఎస్టీ తప్పనిసరిగా ఉంటుంది. అయితే.. జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్‌లతో జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల శుక్రవారం సమావేశం కానుంది. ఈ భేటీ గోవాలో జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో.. జీఎస్టీ కౌన్సిల్ అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈ భేటీలో.. కార్ల నుంచి బిస్కెట్ల వరకు పలు ఉత్పత్తులపై పన్ను తగ్గింపు అంశంపై చర్చించనున్నారని సమాచారం. పన్నుల్లో కోత ఉంటే రాష్ట్రాల ఆదాయాలపై పడే ప్రభావంపైనా చర్చించనుంది కౌన్సిల్. జీఎస్టీ రేట్లను మరింత తగ్గిస్తే కనుగ దేశీయ వినియోగాన్ని పెంచవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. కాగా.. పలు రంగాల్లో మందగమనం, వ్యవస్థీకృత సమస్యల వల్లే వచ్చిందని దానికి జీఎస్టీ కారణం కాదని రాష్ట్రాలు కూడా చెబుతోన్నాయి. చూడాలి మరి.. ఇన్ని సమస్యల నడుమ కౌన్సిల్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.