మందు కొట్టే పెళ్లికొడుకులకో టెస్ట్.. ఆ గ్రామం రూటే సెపరేట్ !

సాధారణంగా వధూవరులకు పెళ్లి కుదిరే ముందు పెళ్ళికొడుకు విద్య, వృత్తి తదితరాలపై వాకబు చేస్తారు పెళ్లికూతురు తరఫు వారు. వరుడు ఎలాంటి దురలవాట్లు లేకుండా ‘ శుద్దిగా ‘, ‘ బుధ్దిగా ‘ ఉన్నాడంటే అతడ్నే ఫైనల్ చేస్తారు. అయితే అతనికి మద్యం తాగే అలవాటు ఉందని తెలిసినా.. ఈ కాలంలో ఇది మామూలే.. ఓ రకంగా స్టయిలే అని సర్దుకుపోయే కుటుంబాలు ఉన్నాయి. కానీ గుజరాత్ లోని ఓ గ్రామం రూటు మాత్రం ఇందుకు పూర్తికి […]

మందు కొట్టే పెళ్లికొడుకులకో టెస్ట్.. ఆ గ్రామం రూటే సెపరేట్ !

Updated on: Oct 27, 2019 | 2:09 PM

సాధారణంగా వధూవరులకు పెళ్లి కుదిరే ముందు పెళ్ళికొడుకు విద్య, వృత్తి తదితరాలపై వాకబు చేస్తారు పెళ్లికూతురు తరఫు వారు. వరుడు ఎలాంటి దురలవాట్లు లేకుండా ‘ శుద్దిగా ‘, ‘ బుధ్దిగా ‘ ఉన్నాడంటే అతడ్నే ఫైనల్ చేస్తారు. అయితే అతనికి మద్యం తాగే అలవాటు ఉందని తెలిసినా.. ఈ కాలంలో ఇది మామూలే.. ఓ రకంగా స్టయిలే అని సర్దుకుపోయే కుటుంబాలు ఉన్నాయి. కానీ గుజరాత్ లోని ఓ గ్రామం రూటు మాత్రం ఇందుకు పూర్తికి విరుధ్ధం. అది కలోల్ తాలూకాలోని ‘ పియాజ్ ‘ గ్రామం. మహా అయితే ఆ గ్రామా జనాభా 6 వేలు. ఎక్కువగా ఠాకూర్లు ఉన్న ఈ విలేజ్ లో ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిరినప్పటికీ.. కాబోయే వరుడి ముక్కు, నోటి వాసన చూస్తారట వధువు తాలూకు వారు. సుమారు 25 మంది ఇలా వింత పరీక్షా విధానంలో ‘ పాల్గొంటారు ‘. వరుడే కాదు.. అతని తండ్రి, అతని కుటుంబంలో మగవారు కూడా ఈ టెస్టును ‘ ఎదుర్కోవాల్సిందే ‘.. నిశ్చితార్థ సమయంలోనే కాక, వెడ్డింగ్ ముందు కూడా ఈ పరీక్ష తప్పనిసరట. ఈ టెస్టులో పెళ్ళికొడుకు విఫలమైన పక్షంలో.. అంటే అతగాడు మందు కొట్టాడని తేలితే.. ఇక ఆ పెళ్లి క్యాన్సిల్ అయినట్టే.. అంతే కాదు.. మద్యం తాగే అలవాటున్న భర్త వల్ల సదరు మహిళ కాపురం కూలిపోయే పరిస్థితే ఏర్పడితే.. అతని కుటుంబం ఆ మహిళకు లక్ష రూపాయల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల క్రితం ఈ గ్రామంలో ఈ ట్రెడిషన్ మొదలైంది. మద్యం తాగి 20 ఏళ్ళ లోపు యువకుల్లో దాదాపు 15 మంది మరణించడంతో గ్రామస్థులు ఈ వింత పరీక్షకు శ్రీకారం చుట్టారు. మద్యం తాగే భర్తల కారణంగా అనేకమంది మహిళల కాపురాలు నాశనమైన వైనాన్ని తాము చూశామని, దానికి చెక్ పెట్టేందుకే ఈ సంప్రదాయాన్ని అమల్లోకి తెచ్చామని ఆ ఊరి పెద్ద చెబుతున్నాడు. ఇక మద్యం ప్రియులైన యువకులంతా ఆ అలవాటును మానుకుని బుధ్దిగా పెళ్లిపీట లెక్కుతున్నారు.

Follow Us