Greta Thunberg Tweets : మా శాంతియుత గళాలు మానవ హక్కుల ప్రతిబింబాలు, గ్రెటా థన్ బెర్గ్, దిశారవికి మద్దతు

టూల్ కిట్ కేసులో అరెస్టయిన క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవికి ప్రపంచ పర్యావరణ రక్షణ కోసం  పోరాడుతున్న గ్రెటా థన్ బెర్గ్ మద్దతు ప్రకటించింది.

Greta Thunberg Tweets : మా శాంతియుత గళాలు మానవ హక్కుల ప్రతిబింబాలు, గ్రెటా థన్ బెర్గ్, దిశారవికి మద్దతు

Edited By:

Updated on: Feb 20, 2021 | 11:55 AM

Greta Thunberg Tweets : టూల్ కిట్ కేసులో అరెస్టయిన క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవికి ప్రపంచ పర్యావరణ రక్షణ కోసం  పోరాడుతున్న గ్రెటా థన్ బెర్గ్ మద్దతు ప్రకటించింది. ఈమె ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ గ్రూప్ అనే వెబ్ సైట్ ని కూడా నిర్వహిస్తోంది. కూల్ కిట్ కేసుకు సంబంధించి దేశద్రోహం, ఇతర ఆరోపణలపై దిశారవి ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తోంది. ఆమె అరెస్టు జరిగిన 5 రోజుల తరువాత గ్రెటా థన్ బెర్గ్.. బాధితులకు (రైతులకు) అనుకూలంగా, గౌరవ ప్రదంగా మా గళాలు శాంతియుతంగా స్పందిస్తూనే ఉంటాయని, ప్రతివారికీ న్యాయం జరగాలని కోరుకుంటాయని ట్వీట్ చేసింది. భావ ప్రకటనా స్వేఛ్చ, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మానవహక్కుల ప్రతిరూపాలని, ప్రజాస్వామ్యంలో ఇవి మౌలిక హక్కులని కూడా ఆమె పేర్కొంది. ఐ స్టాండ్ విత్ దిశారవి అని స్పష్టం చేసింది.

ఆమె (దిశారవి)  ఈ ఉద్యమంలో ఓ భాగస్వామి అని, భారత దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆమె గళమెత్తుతూనే ఉందని ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ గ్రూప్ ట్వీట్ చేసింది. దేశంలో కీలక పాత్ర పోషిస్తున్నవారికి కూడా సమాన  హక్కులు ఉండాలని దిశారవి పోరాడుతోందని ఈ గ్రూప్ పేర్కొంది. నిరసన చేస్తున్న రైతులకు అనుకూలంగా దిశా రవి ట్వీట్ చేసి పెను దుమారాన్ని సృష్టించింది. ఇక… దిశారవి బెయిల్ పిటిషన్ పై శనివారం కోర్టు విచారణ జరపనుంది. కానీ ఆమెను మరో 3 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు.. దిశారవి అరెస్టు కాగా… ఈ కేసులో మరో ఇద్దరికి కోర్టు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది.

Also Read:

China Galwan Clash Video: గాల్వన్ లోయలో ఘర్షణలు, తాజాగా వీడియో రిలీజ్ చేసిన చైనా, ఉద్రిక్తతకు నాడే బీజం.

Indo-china Talks: భారత-చైనా దేశాల మధ్య నేడు పదో దఫా చర్చలు, ఇక ఖాళీ కానున్న గాల్వన్ లోయ.