ఎట్టకేలకు ఆర్టికల్ 370 రద్దుపై నోరు విప్పిన రాహుల్

| Edited By:

Aug 06, 2019 | 1:15 PM

కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు అంశంపై నిన్నటి నుండి.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. మంగళవారం ఉదయం వరకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాత్రం స్పందించలేదు. అయితే ఎట్టకేలకు ట్విట్టర్ ద్వారా ఆర్టికల్ 370 రద్దుపై స్పందించారు. జమ్ముకశ్మీర్ విభజన రాజ్యంగ విరుద్ధమన్నారు. ఏకపక్షంగా విభజించి జాతీయ సమగ్రతను కాపాడలేరన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించ‌డం స‌రికాద‌న్నారు. ప్ర‌జ‌ల‌తో దేశం నిర్మిత‌మై ఉంద‌ని, కేవ‌లం భూమి […]

ఎట్టకేలకు ఆర్టికల్ 370 రద్దుపై నోరు విప్పిన రాహుల్
Follow us on

కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు అంశంపై నిన్నటి నుండి.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. మంగళవారం ఉదయం వరకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాత్రం స్పందించలేదు. అయితే ఎట్టకేలకు ట్విట్టర్ ద్వారా ఆర్టికల్ 370 రద్దుపై స్పందించారు. జమ్ముకశ్మీర్ విభజన రాజ్యంగ విరుద్ధమన్నారు. ఏకపక్షంగా విభజించి జాతీయ సమగ్రతను కాపాడలేరన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించ‌డం స‌రికాద‌న్నారు. ప్ర‌జ‌ల‌తో దేశం నిర్మిత‌మై ఉంద‌ని, కేవ‌లం భూమి ముక్క‌లు కాద‌ంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్ర‌త్యేక అధికారాల‌ను నిర్వీర్యం చేయ‌డం వ‌ల్ల జాతీయ భ‌ద్ర‌త‌కు పెను స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని రాహుల్ గాంధీ తెలిపారు.