Covid Third Wave: భారత్‌కు కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు.. కేంద్రానికి NIDM కీలక నివేదిక

|

Aug 23, 2021 | 2:26 PM

దేశానికి కరోనా థర్డ్‌ వేవ్ ముప్పు పొంచి ఉంది..అక్టోబర్‌ నాటికి పీక్స్‌కు వెళ్లే అవకాశం..పిల్లలపైనే అత్యధిక ప్రభావం..ఇది ఎవరో చెప్పిన మాట కాదు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ..నిపుణుల కమిటీ కేంద్రానికి...

Covid Third Wave: భారత్‌కు కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు.. కేంద్రానికి NIDM కీలక నివేదిక
Coronavirus Spread
Follow us on

దేశానికి కరోనా థర్డ్‌ వేవ్ ముప్పు పొంచి ఉంది..అక్టోబర్‌ నాటికి పీక్స్‌కు వెళ్లే అవకాశం..పిల్లలపైనే అత్యధిక ప్రభావం..ఇది ఎవరో చెప్పిన మాట కాదు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ..నిపుణుల కమిటీ కేంద్రానికి అందించిన నివేదికలోని అంశాలివి. అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవలసిందేనంటూ కేంద్రానికి రిపోర్ట్‌ ఇచ్చింది NIDM. అక్టోబర్ నాటికి కరోనా మహమ్మారి విజృంభించే అవకాశముందని కేంద్రాన్ని హెచ్చరించింది. పెద్దల కంటే పిల్లలపైనే ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని..అందుకు తగినట్లుగా చర్యలు చేపట్టాలని సూచించింది.

చిన్నారులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడితే.. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు ఏ మాత్రం సరిపోవని పేర్కొంది. చిన్న పిల్లలకు వైద్య కోసం డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పిల్లలకు కరోనా టీకా వేయాలని సూచించింది. పిల్లలకు తగ్గట్లుగా కొవిడ్‌ వార్డుల్లో మార్పులు చేయాలని తెలిపింది.

మరోవైపు గాంధీ ఆస్పత్రిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..వ్యాక్సినేషన్ మహా యజ్ఞంలా సాగుతోందన్నారు. వ్యాక్సిన్ పట్ల ప్రజలు అపోహలు వీడాలని.. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఇప్పుడిప్పుడే భారత్‌లో సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. త్వరలో థర్డ్‌ వేవ్‌ రానుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు.

ఈసారి పిల్లలపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని..పిల్లలకు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని సూచించింది నిపుణుల కమిటీ. వీలైనంత త్వరగా పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేసింది. చిన్నారుల్లో ఇన్‌ఫెక్షన్ సోకితే ఇతరులకు వేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని..వ్యాక్సినేషన్‌తో థర్డ్ వేవ్ ఉధృతిని కొంత అరికట్టవచ్చునని సూచించింది.

ఇవి కూడా చదవండి: Jewellers businessmen: వద్దేవద్దు.. గోల్డ్‌పై హాల్‌మార్కింగ్‌కు వ్యతిరేక గళం.. ఇవాళ వ్యాపారుల నిరసన

Viral Video: ఈ మినీ బస్సు చాలా స్పెషల్.. రోడ్డుపై పరుగులు పెడుతుంది.. కానీ అన్ని బస్సుల్లా కాదు..