‘ప్రతీకారం తీర్చుకోవలసిందే.’.. అసదుద్దీన్ ఒవైసీ

భారత- చైనా సరిహద్ద్దుల్లో రెండు దేశాల సైనిక దళాల మధ్య జరిగిన ఘర్షణలో మన ఆర్మీకి చెందిన ఓ కల్నల్ తో సహా ఇద్దరు జవాన్లు మృతి చెందిన ఘటనపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి కాల్పులు జరపని..

ప్రతీకారం తీర్చుకోవలసిందే... అసదుద్దీన్ ఒవైసీ

Edited By:

Updated on: Jun 16, 2020 | 6:35 PM

భారత- చైనా సరిహద్ద్దుల్లో రెండు దేశాల సైనిక దళాల మధ్య జరిగిన ఘర్షణలో మన ఆర్మీకి చెందిన ఓ కల్నల్ తో సహా ఇద్దరు జవాన్లు మృతి చెందిన ఘటనపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి కాల్పులు జరపని మన సైనికులను వాళ్ళు (చైనా సైనికులు ) కొట్టి చంపడం దారుణమని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఉభయ దేశాల దళాల మధ్య సింగిల్ బుల్లెట్ కూడా ఫైర్ కాలేదని  ఓ రిపోర్టర్ చేసిన ఓ ట్వీట్ ని ఆయన హైలైట్ చేస్తూ.. అంటే మన సైనికులను మన భూభాగంలోనే చైనీయులు కొట్టి హతమార్చారన్న విషయం అర్థమవుతోందన్నారు. ఆ ముగ్గురు సైనికుల కుటుంబాలకు ఒవైసీ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ.. వారి త్యాగం వృధా కారాదని, భారత ప్రభుత్వం చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు.