జీఎస్టీ బిల్లులపై ప్రజల్లో ఉన్న అపోహలు, అవాస్తవాలను తొలగించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్‌స్, కస్టమ్స్ తాజాగా ఓ ట్వీట్ చేసింది.
జీఎస్టీ బిల్లుల్లో పెరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకుని, జీఎస్టీ కౌన్సిల్ లా కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 12,000 నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 365 మందిని అరెస్టు చేసినట్లు తెలిపింది. 6 వారాల్లో, సుమారు 165 నకిలీ కేసులలో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపింది.
జీఎస్టీ పన్ను విధానంలో చెల్లింపుదారులకు పన్ను చెల్లింపునకు తగిన సమయం ఇవ్వబడుతుందని, ఊరికే రిజిస్ట్రేషన్ రద్దు చేయబడదని సీబీఐసీ తెలిపింది. ఉద్దేశపూర్వకంగా ట్యాక్స్ ఎగవేత రుజువు అయినప్పుడు మాత్రమే జీఎస్టీ సస్పెన్షన్ ఉంటుందని పేర్కొంది.
నెలవారీ రూ.50 లక్షలకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపారులు జీఎస్టీ కేవలం 1% నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నిబంధన గతంలో లేదని, ఇటీవలే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్స్ అండ్ కస్టమ్స్ జీఎస్టీ నిబంధనలలో కొత్తగా రూల్ 86 బీని ప్రవేశపెట్టిందని పేర్కొంది. దీని ప్రకారం జీఎస్టీ చెల్లింపు దారులు వారి ఐటీసీని గరిష్టంగా 99 శాతం వరకు ఉపయోగించడానికి అనుమతి ఇస్తోంది.
Https://www.gst.gov.in వెబ్‌సైట్‌ను తెరవండి.
ఇప్పుడు సెర్చ్ టాక్స్ పేయర్ ఎంపికకు వెళ్లి… GSTIN / UIN ద్వారా సెర్చ్ పై క్లిక్ చేయండి.
GST సంఖ్య తప్పు అయితే, సరైన సంఖ్యను నమోదు చేయమని చూపిస్తుంది. సంఖ్య సరైనది అయితే దాని స్థితి చూపబడుతుంది. ఇందులో వ్యాపారం పేరు, రాష్ట్రం, రిజిస్ట్రేషన్ తేదీ, వ్యాపారం రకం – ప్రైవేట్ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వంటి వివరాలు ఉంటాయి.
GSTIN / UIN యొక్క మొదటి రెండు సంఖ్యలు స్టేట్ కోడ్ కోసం. దాని తర్వాత 10 అంకెలు వ్యాపార యజమాని లేదా దుకాణం యొక్క పాన్ సంఖ్య. మరో విషయం ఏంటంటే… దుకాణదారుడు మీకు 15 అంకెలు గల జీఎస్టి సంఖ్య లేని బిల్లు, చేతితో రాసిన బిల్లు ఇచ్చినట్లయితే మీకు లభించే బిల్లు నకిలీ కావచ్చు. అప్పుడు మీరు కస్టమర్ వాణిజ్య పన్ను విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు.
Myths v. Facts on CGST Notification issued on 22.12.2020 to curb GST Fake invoice frauds. pic.twitter.com/xoPVUjhTuK
— CBIC (@cbic_india) December 23, 2020