ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక ప్రకటన చేశారు. పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పెంపొందించేందుకు ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను సింగపూర్‌కు పంపి శిక్షణ ఇస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది . ఇందుకోసం పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను శిక్షణ కోసం పంజాబ్ రాష్ట్రానికి పంపనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10 వరకు సింగపూర్‌లో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తమనే వాగ్దానంతోనే పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రం విద్యారంగంలో విప్లవ వాగ్దానం మేరకు తమ పార్టీ అహోరాత్రులు కష్టపడుతోందని సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు. విద్యలో విప్లవం రావాలంటే, మొదటగా ఉపాధ్యాయుడు, పిల్లల తల్లిదండ్రుల మధ్య అంతరం తొలగిపోవాలని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని సీఎం భగవంత్ మాన్ ఉద్ఘాటించారు. పిల్లవాడు పాఠశాలలో ఎలా చదువుతున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, అదేవిధంగా, పాఠశాల తర్వాత పిల్లవాడు ఏఏ కార్యకలాపాలలో పాల్గొంటున్నాడో దృష్టిపెట్టలన్నారు. పాఠ్యేతర కార్యకలాపాలపై పిల్లల అభిరుచుల గురించి ఉపాధ్యాయులు కూడా తెలుసుకోవడం చాలా అవసరమని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..