EV fire: ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ ప్రమాదాలపై కేంద్రం ఫోకస్.. కొత్త మోడల్స్ లాంచింగ్‌పై నిషేధం

|

Apr 29, 2022 | 11:29 AM

ఇప్పటివరకు ప్రయోజనాలే చూశారు. ఏకంగా ప్రాణాలు పోతుండడంతో రెండోవైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ ప్రమాదాలపై కేంద్రం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. కొత్త మోడల్స్ లాంచింగ్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

EV fire: ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ ప్రమాదాలపై కేంద్రం ఫోకస్.. కొత్త మోడల్స్ లాంచింగ్‌పై నిషేధం
Ev Fire
Follow us on

ఇప్పటివరకు ప్రయోజనాలే చూశారు. ఏకంగా ప్రాణాలు పోతుండడంతో రెండోవైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌(electric scooters) ప్రమాదాలపై కేంద్రం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. కొత్త మోడల్స్ లాంచింగ్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కచోటో కాదు.. రెండు చోట్లో కాదు. ఒకటో, రెండో ప్రమాదాలు కాదు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలో జరిగిన వరుస ఘటనలు ప్రజల్లో ఒకింత భయాందోళన కలిగించాయి. అసలు.. ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ ఎంత వరకు సేఫ్‌? బ్యాటరీలు ఎందుకు పేలుతున్నాయి? లోపం ఎక్కడుంది? ఇలాంటి మౌలిక ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. కొత్త మోడల్స్‌ రిలీజ్‌ చేయొద్దని ఈవీ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే నియమించిన కమిటీ నివేదిక వచ్చేవరకు కొత్త మోడల్స్‌ విడుదలపై బ్యాన్ విధించినా.. పాత మోడల్స్ విక్రయించుకోవచ్చని స్పష్టంచేసింది. ప్రజారోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్త మోడల్స్‌ లాంచింగ్‌పై కేంద్రం నిషేధం విధించింది.

సెంచరీ దాటి నాన్‌స్టాప్‌గా దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలను భరించలేని మధ్య తరగతి ప్రజానీకం.. ఎలక్ట్రిక్ వెహికల్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. కేంద్రం కూడా పర్యావరణ హితం పేరుతో కొంత రాయితీ కల్పిస్తోంది. మెయింటెనెన్స్‌ అంతగా లేకపోవడం.. చార్జింగ్ ఖర్చు తక్కువగా ఉండడంతో బ్యాటరీ వెహికల్స్‌కి క్రేజ్, డిమాండ్‌ పెరిగింది. ఇంతలోనే కొత్త సమస్య.

పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగి ఆహుతైపోతున్నాయి. అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. నెల రోజుల్లో ఆరు ప్రమాదాలు. ఒక ఘటన మరిచిపోకముందే మరోటి. దీంతో కేంద్రం సీరియస్ అయింది. ఈవీ కంపెనీలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఏకంగా వార్నింగ్‌ ఇచ్చారు.

భద్రతా లోపాలున్న వాహనాలను రీకాల్‌ చేయాలని ఆయన ఆదేశం. వరుస ప్రమాదాలపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ నియమించారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం ఆదేశాలతో ఎలక్ట్రిక్‌ వెహికల్స్ తయారు చేస్తున్న కంపెనీలు ఇప్పటికే వాహనాల రీకాల్‌ మొదలు పెట్టాయి.

ప్యూర్‌ కంపెనీ 2వేల వాహనాలను రీకాల్‌ చేయగా.. ఒకినావా ఆటోటెక్‌ కంపెనీ 3,215 వాహనాలను వెనక్కి తెప్పిస్తోంది. ఓలా కూడా అదే బాటలో పయనించక తప్పలేదు. 1441 స్కూటర్లను రీకాల్ చేసింది ఓలా. పర్యావరణ హితమే అయినా ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి: Health Tips: ఆహారం తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే..

Back Pain Remedies: వెన్నునొప్పికి దాల్చిన చెక్కతో ఉపశమనం.. ఇలా వాడితే అద్భుతమైన ప్రయోజనం..

Tea and Diabetes: ఈ స్పెషల్ టీ డయాబెటిక్ పేషెంట్‌కి దివ్యౌషధం.. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇలా వాడండి..