COVID-19 vaccines: కోవిడ్ వ్యాక్సిన్ల ధరలపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం.. ధరలు భారీగా తగ్గింపు.. అందరికీ ఒకే రేటు

Government of India: కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19 వ్యాక్సిన్ ధరలను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ ధరలపై

COVID-19 vaccines: కోవిడ్ వ్యాక్సిన్ల ధరలపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం.. ధరలు భారీగా తగ్గింపు.. అందరికీ ఒకే రేటు
COVID-19 vaccines price

Updated on: Apr 24, 2021 | 12:01 PM

Government of India: కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19 వ్యాక్సిన్ ధరలను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ ధరలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ధరలను భారీగా తగ్గిస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను.. భారత ప్రభుత్వం డోసుకు రూ.150 చొప్పున నిర్ణయించింది. అయితే ప్రభుత్వం వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు పూర్తిగా ఉచితంగా అందిస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అయితే.. కరోనా నివారణా వ్యాక్సిన్లను దేశంలో కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలు, ప్రైవేట్ ఆసుపత్రులకు 600 రూపాయలుగా రెండు రోజుల క్రితం నిర్ణయించారు. అయితే దీనిపై దేశవ్యాప్తంగా కేంద్రంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సామాన్యులకు అందుబాటులో ఉండకుండా, రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడేలా ధరలను నిర్ణయించటాన్ని రాజకీయ పార్టీలన్నీ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేశాయి.

వన్ నేషన్.. వన్ ట్యాక్స్ విధానాన్ని అందరూ అంగీకరించినప్పుడు.. ఇలా ధరలను వ్యత్యాసంలో ఎలా ప్రకటిస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read:

Medical Oxygen Shortage: ఢిల్లీలో దారుణం.. ఆక్సిజన్ కొరతతో మరో 20 మంది బలి.. మరికొంత మంది పరిస్థితి విషమం

CM CKR Review: కరోనా ఉధృతిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై కీలక ఆదేశాలు జారీ..!