Car Seat Belts: ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. ఇక కార్లలో కూర్చునే ప్రయాణికులందరికీ త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం కార్లలో ముందు సీట్లకు, వెనుక రెండు సీట్లకు త్రీపాయింట్ సీట్ బెల్టులున్నాయి. ఇటీవల కార్లలో వెనుక భాగంలోని మధ్య సీటుకూ టూ పాయింట్ సీట్‌బెల్ట్ ఉంటోంది. అయితే ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో మధ్య సీట్లలో ఉండేవారికి ప్రాణాల ముప్పు, లేదా తీవ్రంగా గాయాలయ్యే అవకాశం ఉంది.
ఇందుకే మధ్య సీటుకు కూడా త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయం మంత్రి వెల్లడించలేదు. దేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే.. 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇలా అన్ని సీట్లకూ బెల్టులు ఉంటే మరణాల సంఖ్య తగ్గుతుందని అన్నారు.
ఇవి కూడా చదవండి: