International Women’s Day 2021: మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన గూగుల్..యానిమేటెడ్ వీడియోతో డూడుల్..

Women's Day 2021:  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా గూగుల్ మహిళల పట్ల గౌరవం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2021

International Womens Day 2021: మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన గూగుల్..యానిమేటెడ్ వీడియోతో డూడుల్..

Edited By:

Updated on: Mar 08, 2021 | 6:49 AM

Women’s Day 2021:  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా గూగుల్ మహిళల పట్ల గౌరవం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2021 సందర్బంగా గూగుల్ మహిళా శక్తికి ప్రత్యేకంగా డూడుల్‎ను అంకితమిచ్చింది. ఈ డూడుల్‏లో యానిమేషన్ వీడియోను క్రియేట్ చేసింది. ఇందులో మహిళల విభిన్న పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందించింది. ప్రస్తుతం మహిళలకు పురుషులతో సమానంగా ప్రతి రంగంలోనూ వారి కీర్తిని చాటుతున్నారు.

ఈ యానిమేటెడ్ వీడియోలో నేటి మహిళా శక్తిని ప్రతిబింబించేలా రూపొందించింది. ధరణిపై జన్మించిన మహిళ తన కీర్తిని అంతరిక్షంలోకి ప్రయాణించే మహిళ వరకు ఎదురైన అవంతారాలను జయించాలనే విధంగా క్రియేట్ చేసింది. . అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళల అనేక పాత్రలను చూపించే ఈ డూడుల్ మహిళల శక్తిని, శక్తిని సమాజానికి తెలియజేస్తోంది. ఇక గూగుల్ ప్రత్యేక వీడియోలో మహిళలలు అన్ని సవాళ్ళను అధిగమించి విద్య, పౌర హాక్కులు, విజ్ఞాన శాస్త్రం, కళల, అంతరిక్షంలో సహా అన్ని రంగాలలో చరిత్రను సృష్టించిన మహిళా మార్గదర్శకుల కథను డూడుల్ చూపించేలా దీనిని రూపొందించింది. ప్రతి మహిళ కృషికి గూగుల్ దీనిని అంకితమిచ్చింది. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటారు. వివిధ రంగాలలో ఉత్సహంగా పాల్గోంటున్న మహిళలకు గౌరవార్థంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.