Good News: ఫైజర్ వ్యాక్సిన్ భారతదేశంలో వినియోగానికి అనుమతి ఇచ్చే దిశలో ప్రభుత్వం..జూలై నుంచి అందుబాటులోకి?

| Edited By: Janardhan Veluru

May 28, 2021 | 2:55 PM

Pfizer Vaccine: కరోనా రెండో వేవ్ ప్రానంతకంగా పరిణమించింది. దీనిని అధిగమించడానికి వ్యాక్సిన్ ఒక్కటే బ్రహ్మాయుధం అని అందరూ భావిస్తున్నారు.

Good News: ఫైజర్ వ్యాక్సిన్ భారతదేశంలో వినియోగానికి అనుమతి ఇచ్చే దిశలో ప్రభుత్వం..జూలై నుంచి అందుబాటులోకి?
Good News
Follow us on

Good News: కరోనా రెండో వేవ్ ప్రానంతకంగా పరిణమించింది. దీనిని అధిగమించడానికి వ్యాక్సిన్ ఒక్కటే బ్రహ్మాయుధం అని అందరూ భావిస్తున్నారు. అయితే, కరోనా టీకాను అందరికీ ఇవ్వడానికి అవసరమైనంత లభ్యత లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్ టీకాను ప్రజలందరికీ అందిచాలని ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు దేశంలో ఇప్పటికే అనుమతులు పొందిన కోవాక్సిన్, కోవీషీల్డ్, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి దేశ అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఫైజర్ సంస్థ(Pfizer) తమ టీకాలను భారత దేశానికి అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ సంస్థ కోరిన కొన్ని అభ్యర్ధనల విషయంలో సందిగ్ధత నెలకొని ఉంది. ఒకవేళ ఫైజర్ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇస్తే నాలుగు నెలల్లో ఐదు కోట్ల మోతాదుల వ్యాక్సిన్ తాము అందించగలమని ఫైజర్ సంస్థ చెబుతుండటంతో ఆ టీకా వస్తే కొరత తీరుతుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రం ఈరోజు ఒక శుభవార్త చెప్పింది. ఫైజర్ తీకలకు అనుమతి ఇచ్చేందుకు అవాకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వికె పాల్ ఒక ప్రకటన చేశారు.

నష్టపరిహారం కోసం ఫైజర్ అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలిస్తోందని, ప్రజల ప్రయోజనం కోసం దాని యోగ్యతపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ” మేము ఫైజర్‌తో చర్చల్లో నిమగ్నమై ఉన్నాము. రాబోయే నెలల్లో కొంత మొత్తంలో వ్యాక్సిన్ అందించగలమని వారు చెబుతున్నారు. బహుశా జూలై నుండి ఇది ప్రారంభమవుతుంది” అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం టీకాల కొరత నివారణకోసం అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. అందులో భాగంగానే ఫైజర్ సంస్థ చేసిన అభ్యర్ధనను పరిశీలిస్తోంది. ఫైజర్ సంస్థ తాను టీకాలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్న అన్ని దేశాలనూ కోరినట్టుగానే ఇక్కడా కొన్ని అంశాలలో స్పష్టత కోరుతోంది. ఈ అభ్యర్ధనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయమూ జరగలేదు. కానీ, ప్రజల విస్తృత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫైజర్ సంస్థ టీకాలను మన దేశంలో అనుమతించే అవకాశం ఉంది అని పాల్ చెప్పారు.

Covid Vaccine

ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్ మధ్య 5 కోట్ల మోతాదును భారత్‌కు అందించడానికి సిద్ధంగా ఉన్న ఫైజర్, నష్టపరిహారంతో సహా కొన్ని సడలింపులను కోరింది. సంస్థ ప్రభుత్వంతో వరుస చర్చలను నిర్వహిస్తోంది. ఫైజర్ సంస్థ తన టీకాల సమర్ధతపై ఇప్పటికే ప్రభుత్వానికి కొన్ని విషయాలు తెలిపింది. తమ వ్యాక్సిన్ 12 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారందరకీ అనుకూలంగా ఉంటుందని చెప్పింది. అదేవిధంగా దీనిని 2-8 డిగ్రీల వద్ద నిలవచేయవచ్చని వెల్లడించింది.

Also Read: Vaccine Mix: వ్యాక్సిన్ మిక్స్ విధానం టీకాల కొరతను అధిగమించేలా చేస్తుందా? అది సాధ్యమేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

Unique Health ID: కరోనా టీకా సర్టిఫికేట్ లో కనిపిస్తున్న ప్రత్యేక హెల్త్ఐడీ.. ఇది ఏమిటి? దీనివలన ఉపయోగం ఏమిటి?