Gas Cylinder: గ్యాస్ సిలిండర్లు వాడే వారికి గొప్ప శుభవార్త.. కొత్త రూల్స్ తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అదేంటంటే..!
Gas Cylinder: ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేనిది ఉండదు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిపైనే వంట చేసుకునేది. కానీ మోదీ సర్కార్ వచ్చాక...
Gas Cylinder: ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేనిది ఉండదు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిపైనే వంట చేసుకునేది. కానీ మోదీ సర్కార్ వచ్చాక అలాంటి ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ సిలిండర్‌ను వాడుతున్నారు. అయితే ఇప్పుడు మీకు చెప్పబోయే న్యూస్ గ్యాస్ సిలిండర్ వాడే వినియోగదారులకు ఇది శుభవార్తే. రానున్న రోజుల్లో ఏ డీలర్ వద్ద అయినా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఈ విధానం ద్వారా చాలా మందికి మేలు చేకూరనుంది. సిలిండర్‌ల కొరత ఉన్న కాలంలో ఇలాంటి విధానం ద్వారా చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది.
తాజా నివేదికల ప్రకారం.. రానున్నన రోజుల్లో మీరు మీకు నచ్చిన డీలర్ వద్ద సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఎవరి వద్దనైనా సిలిండర్ డెలివరి తీసుకోవచ్చు. అంటే మీరు ఎవరైతే ఫాస్ట్‌గా సిలిండర్ డెలివరి చేస్తారో వారి వద్ద సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఒక సాఫ్ట్ వేర్ తయారు చేస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా వినియోగదారులు ఏ డీలర్ వద్దనైనా సిలిండర్ బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇండేన్, భారత్, హెచ్‌పీ ఇలా ఏ కస్టమర్ అయినా ఏ కంపెనీ డీలర్ వద్దనైనా సిలిండర్ డెలివరీ తీసుకునే వెసులుబాటు ఉండనుంది. అంతేకాకుండా నరేంద్రమోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ రూల్స్ కూడా సవరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
నిబంధనల సవరణ:
కాగా, గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే తప్పకుండా అడ్రస్ ప్రూఫ్ కావాల్సి ఉంటుంది. ఇది లేకపోతే సిలిండర్ కనెక్షన్ పొందే అవకాశం ఉండదు. అయితే ఈ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా కూడా గ్యాస్ సిలిండర్ లభ్యమయ్యేలా చర్యలు చేపట్టనుంది. కాగా, ఈ విధానం కనుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుంది. సిలిండర్లతో ఉన్న కొంత ఇబ్బందులు దూరమవుతాయి. ప్రస్తుతం గ్యాస్ సిలింబర్ బుక్ చేసుకోవాలంటే వారికి ఉన్న డీలర్ వద్దకే వెళ్లిల్సి ఉంటుంది. తాజాగా కేంద్రం తీసుకువచ్చే విధానం అందుబాటులోకి ఇస్తే అలాంటి ఇబ్బంది ఉండదు. ఏ డీలర్ వద్దనైనా సిలిండర్ తీసుకునే వెలుసుబాటు ఉంటుంది.