AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas Connections: మోదీ సర్కార్‌ కీలక నిర్ణయం.. రానున్న రెండేళ్లలో ఉచితంగా కోటి మందికి ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్‌

LPG Gas Connections: రానున్న రెండేళ్లలో ఉచితంగా కోటి మందికి గ్యాస్‌ కనెక్షన్‌LPG Gas Connections: నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో అత్యంత ముఖ్యమైనది ఉజ్వల..

LPG Gas Connections: మోదీ సర్కార్‌ కీలక నిర్ణయం.. రానున్న రెండేళ్లలో ఉచితంగా కోటి మందికి ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్‌
Subhash Goud
|

Updated on: Mar 04, 2021 | 1:00 AM

Share

LPG Gas Connections: రానున్న రెండేళ్లలో ఉచితంగా కోటి మందికి గ్యాస్‌ కనెక్షన్‌LPG Gas Connections: నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో అత్యంత ముఖ్యమైనది ఉజ్వల పథకం. దీని కింద దేశ వ్యాప్తంగా ఉచితంగా ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్లు అందిస్తోంది. గృహ కాలుష్యాన్ని తగ్గించి మహిళల ఆరోగ్యాన్ని మెరుగు పర్చేందుకు తీసుకువచ్చిన ఈ పథకం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. రాబోయే రెండేళ్లలో మరో కోటి మందికి ఉచితక కనెక్షన్లు ఇవ్వాలని, దేశంలోని స్వచ్చమైన, వందశాతం ఇంధనంతో గ్యాస్‌ యాక్సెస్‌ సులభతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా చమురు కార్యదర్శి తరుణ కపూర్‌ మాట్లాడుతూ .. ఎల్పీజీ కొత్త కనెక్షన్‌ల కోసం గుర్తింపుపత్రాలు, నివాస స్థల గుర్తింపు లాంటి వాటి కోసం పట్టుబట్టకుండా విధానాన్ని సులభతరం చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. అలాగే వినియోగదారులు ఒకే డీలర్ వద్ద గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి బదులుగా అందుబాటును బట్టి ముగ్గురు డీలర్ల వద్ద సిలిండర్ తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. పేద మహిళలకు కేవలం నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో 8 కోట్ల ఉచిత ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్లు అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం వంట గ్యాస్‌ వినియోగించే వారి సంఖ్య దేశ వ్యాప్తంగా 29 కోట్లకు చేరిందని అన్నారు.

రానున్న రెండేళ్లలో కోటి మందికి..

ఇప్పటికే అదనపు కోటి గ్యాస్‌ కనెక్షన్లను ఇవ్వనున్నామని, గత నెల ప్రారంభం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనే ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఈ అదనపు కోటి కనెక్షన్లను రానున్న రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021-22 బడ్జెట్‌లో దీని ప్రత్యేక కేటాయింపులు చేయనప్పటికీ సాధారణ ఇంధన సబ్సిడీ కేటాయింపునకు రూ.1600లు భరించనుంది. నిరుపేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ పథకాన్ని సైతం అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2018లో ప్రశంసించింది. తర్వాత సంవత్సరంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) అభినందించింది. స్వచ్ఛమైన శక్తి వనరులు, పర్యావరణ రక్షణతో పాటు మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

అంతేకాకుండా కార్బన్‌ డై ఆక్సైడ్‌, బ్లాక్‌ కర్బన్‌ ఉద్గారాలను తగ్గించడానికి ఎల్పీజీ ఉపయోగపడుతుంది. అలాగే గ్లోబర్‌ వార్మింగ్‌ రెండో అతిపెద్ద సహాయకారిగా పని చేస్తోంది. ఉజ్వల పథకం ప్రవేశపెట్టకముందు గృహ, పరిసర వాయు కాలుష్యం కారణంగా మరణించిన వారి సంఖ్య భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఎల్పీజీ కనెక్ష పొందడానికి ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. అయితే ప్రాక్టికల్‌గా నివాస స్థలం రుజువు లేకుండా వంటగ్యాస్‌ కష్టం. ఇలాంటి ఫిర్యాదులను తొలగించాలని తాము చమురు కంపెనీలను కోరినట్లు తరుణ్‌కపూర్‌ తెలిపారు. తాత్కాలికంగా ఒక నగరం నుంచి మరొక నగరానికి మారుతున్న వ్యక్తులకు ఇబ్బంది లేకుండా ఎల్పీజీ కనెక్షన్ పొందగలగాలని, తాము ఆ దశకు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అయితే గ్యాస్‌ కనెక్షన్ కు ప్రాథమిక పత్రాలు, చిన్న గుర్తింపు ఉంటే సరిపోతుందని ఆయన చెప్పారు.

ఇవి చదవండి:

Post Office: పోస్టాఫీసుల్లో నగదు ఉపసంహరణలు, డిపాజిట్లలపై చార్జీల వసూలు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

RBI Instructions : చిరిగిపోయిన కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు.. బాధితులు వాటిని మార్చుకోవడానికి ఏం చేయాలంటే..