Good News for govt employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త… వేరబుల్ డీఏ పెంచుతూ నిర్ణయం
Govt Hikes Variable DA: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వేరబుల్ డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో 1.5 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం అందుతుంది. ఏప్రిల్ 1 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వేరబుల్ డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 1.5 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం అందుతుంది. ఏప్రిల్ 1 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వంలోని కొంత మంది వర్కర్లు, ఉద్యోగులకు వేరబుల్ డీఏ పెంపు నిర్ణయం వర్తిస్తుంది. నెలకు రూ.105 నుంచి రూ.210 వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఈ ఉద్యోగులకు కనీస వేతనం కూడా పెరగనుంది. దీనికి సంబంధించి కేంద్ర కార్మిక శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది .
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు, రైల్వే అడ్మినిస్ట్రేషన్, మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్, పెద్ద పెద్ద పోర్టులు, కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్లకు ఇంక్రిమెంట్ పెంపు నిర్ణయం వర్తిస్తుంది. కాంట్రాక్ట్, క్యాజువల్ వర్కర్లకు కూడా ఇదే రేట్లు వర్తిస్తాయి. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కేంద్రం నిర్ణయంతో చాలా మందికి ఊరట కలుగుతుంది.
Rate of Minimum Wages Revised for Central sphere Employees, this will benefit about 1.50 crore workers engaged in various scheduled employments in central sphere across the country – LEM @santoshgangwar https://t.co/tzaRl0jP75 pic.twitter.com/B15tSN9vTB
— Ministry of Labour (@LabourMinistry) May 21, 2021