Goa Polls 2022: గోవా అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న ముగిశాయి. 40 మంది సభ్యులు ఉన్న గోవా ఎన్నికల ఫలితాలు మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే.. పాలన చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పలు ప్రధాన పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. ఓట్ల లెక్కింపు జరగకముందే గోవాలో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటుండం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పలువురు నాయకులు సరికొత్త వ్యూహాలతో ఓట్ల లెక్కింపునకు ముందు ప్రణాళికలు రచిస్తుండటం ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రాంతీయ దినపత్రిక ది గోవాన్ ఎవ్రీడే ప్రకారం.. ఫిబ్రవరి ఎన్నికలలో స్వతంత్రులుగా పోటీ చేసిన ఐదుగురు నాయకులు ఉన్నారు. వీరంతా ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒకరినొకరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తీర ప్రాంత రాష్ట్రంలోని ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ వస్తే.. ఎవరిని ఎన్నుకుంటే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి.. అన్న దానికి బేరసారాలు మొదలయ్యాయి. దినపత్రికలో పేర్కొన్న దాని ప్రకారం వారు ఎవరంటే..? మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ (మండ్రేమ్), చంద్రకాంత్ షెట్యే (బిచోలిమ్), సావిత్రి కవ్లేకర్ (సంగూమ్), దీపక్ పౌస్కర్ (సంవోర్డెమ్), విజయ్ పై ఖోట్ (కనకోనా)గా పేర్కొంది. వీరంతా తమ గెలుపు అవకాశాలపై అపార నమ్మకంతో ఉన్నారు. దీనిపై కాలమనిస్ట్ అజయ్ ఝా.. కీలక వ్యాసం రాశారు. కొంతమంది స్వతంత్రులు గోవాలో హంగ్ అసెంబ్లీ కోసం ప్రార్థిస్తున్నారన్నారు. తద్వారా వారు ప్రయోజనాలను పొందవచ్చన్న వ్యూహంలో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీయే తమ అభిమతమని.. బేరసారాలు చేస్తున్నట్లు అజయ్ ఝా వ్యాసంలో పేర్కొ్న్నారు.
గోవాలో ఓట్ల లెక్కింపునకు ఇంకా వారం ఉండగానే రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో పాలన ఎవరు సొంతం చేసుకుంటారో తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే. కానీ.. రాష్ట్రంలో మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న ధీమాతో కొత్త రాజకీయం మొదలైంది. స్వతంత్ర సభ్యుల అండదండల కోసం పలు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. వాస్తవానికి స్వతంత్రంగా గెలిచిన వారు.. తమకిష్టమైన వారికి మద్దతు తెలపవచ్చు. అయితే.. ఇలాంటి రాజకీయం వల్ల గతంలో కాంగ్రెస్ పాలనను చేజిక్కించుకోలేకుండా పోయింది. 2017లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు తీవ్రంగా పోటీ పడటంతో ముగ్గురు స్వతంత్రులకు చాలా డిమాండ్ ఏర్పడింది. మెజారిటీ కోసం బీజేపీ వారి మద్దతును తీసుకోని పూర్తి పదవీకాలం కొనసాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
ఆ ఐదుగురి కోసం..
అయితే.. ఐదేళ్ల కింద గోవాలో ఏర్పడిన పరిస్థితులు మళ్లీ ఏర్పడేలా ఉన్నాయి. మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. స్పష్టమైన మెజారిటీ కోసం మళ్లీ స్వతంత్రుల మద్దతు తప్పదని పేర్కొంటున్నాయి. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఎనిమిది మంది స్వతంత్రులు తాము విజేతగా నిలుస్తామంటూ పేర్కొంటున్నారు. అయితే.. బలమైన అభిప్రాయం ఉన్నవారు ఐదుగురితో కలిసి పవర్ గ్రూప్‌గా మారారని.. ఐక్యంగా ఉంటే మంచి బేరంతోపాటు ప్రయోజనాలు దక్కుతాయని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ (మండ్రేమ్), చంద్రకాంత్ షెట్యే (బిచోలిమ్), సావిత్రి కవ్లేకర్ (సంగూమ్), దీపక్ పౌస్కర్ (సాన్‌వోర్డెమ్), విజయ్ పై ఖోట్ (కనకోనా) ఉన్నారు. వీరిలో చాలా మంది BJPకి ప్రత్యేక్ష-పరోక్ష సంబంధాన్ని కలిగి ఉన్నారు.
వాస్తవానికి ఇతర పార్టీల నుండి 17 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న తరువాత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పార్టీ నామినేషన్ ఫారం ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా ఐదుగురు స్వతంత్రులు, విజయం సాధించగలరని ఖచ్చితంగా చెప్పవచ్చు. దీపక్ పౌస్కర్ మాత్రమే బయటినుంచి పోటీ చేసే సభ్యుడు. అతను మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (MGP) శాసనసభ్యులలో ఒకరు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మద్దతు ఇవ్వాలని MGP నిర్ణయించింది. 2019లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, ఎంజీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అందులో చేరడంతో ఆయన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే తనపై 2017లో 5,000 ఓట్లకు పైగా ఓడిపోయిన గణేష్ గాంకర్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో పౌస్కర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగవలసి వచ్చింది.
అలాంటి వ్యక్తుల్లో లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా ఒకరు. కాంగ్రెస్ నుంచి వచ్చిన లక్ష్మీకాంత్ పర్సేకర్ ఎమ్మెల్యే కాకపోవడంతో.. బిజెపి ప్రమోద్ సావంత్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. బీజేపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా పర్సేకర్‌ను నియమించింది. అయితే, నార్త్ గోవాలోని మాండ్రేమ్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిని పేర్కొనే విషయానికి వస్తే.. బీజేపీ సోప్టేకు కేటాయించింది. దీంతో ఆయన పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2019లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన సమయంలో మరో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి పెద్ద తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్లేకర్ భార్య అని సావిత్రి కవ్లేకర్ కూడా బీజేపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.
పనాజీ నుంచి ఉత్పల్ పారికర్ పోటీలో ఉన్నా..
ఈ జాబితాలో చేర్చని ఒక పేరు కూడా ఉంది. అతనే.. మాజీ సీఎం పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్. ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఉత్పల్ తండ్రి పనాజీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ స్థానాన్ని కాంగ్రెస్ నుంచి వచ్చిన అటానాసియో మాన్‌సెరేట్‌కు బీజేపీ కేటాయించింది. అయితే.. ఇక్కడ ఎవరు గెలిచినా బీజేపీ గెలుస్తుందన్న ధీమా నాయకుల్లో ఉంది. ఈ ఎన్నిక ఉత్పల్ కు రాష్ట్రంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకోవడానికి చేసిందని పేర్కొంటున్నారు. అయితే.. ప్రస్తుతం గెలుపు ధీమాతో ఉన్న ఐదుగురు కాబోయే ఎమ్మెల్యేల బృందం ఒకవేళ హంగ్ వస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో చేతులు కలపడానికి మొగ్గు చూపుతున్నట్లు వార్తాపత్రిక పేర్కొంది.
Also Read: