AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డెలివరీ బాయ్‌ని చితక బాదిన మహిళ.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..

కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.. చిన్న విషయానికి కూడా శివాలెత్తిపోతుంటారు.. కోపంతో ఏం చేస్తారో కూడా మర్చిపోతుంటారు.

Viral Video: డెలివరీ బాయ్‌ని చితక బాదిన మహిళ.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..
Girl Beat Up A Biker
Rajeev Rayala
|

Updated on: Apr 15, 2022 | 9:41 PM

Share

Viral Video: కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.. చిన్న విషయానికి కూడా శివాలెత్తిపోతుంటారు.. కోపంతో ఏం చేస్తారో కూడా మర్చిపోతుంటారు. తాజాగా ఓ మహిళ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొంత మంది ఈ వీడియో పై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం ఆ మహిళను సమర్థిస్తున్నారు. ఇంతకు ఆ వీడియోలో మహిళ ఏంచేసిందంటే.. నిజానికి మహిళలు చాలా సహనంతో ఉంటారు అంటారు. కానీ ఈ మహిళ మాత్రం ఆ సహనాన్ని కోల్పోయింది. ఓ డెలివరీ బాయ్ చేసిన పనికి రోడ్డు పైనే చెప్పుతో కొడుతూ హల్ చల్ చేసింది. ఇంతకు అతడు చేసిన తప్పేంటంటే.. మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్ జిల్లాలోని రస్సెల్ చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి రాంగ్ రూట్ లో వచ్చి ఓ మహిళ స్కూటీని ఢీ కొట్టాడు.

అంతే కోపంతో ఊగిపోయిన ఆ మహిళ నడి రోడ్డుమీద అందరు చూస్తుండగా.. అతడిని నోటికొచ్చినట్టు తిడుతూ.. తన కాలి షూ తో కొట్టింది. చుట్టూ ఉన్నవారు వాదిస్తున్నా ఆమె వినిపించుకోకుండా అతడిని విపరీతంగా కొట్టింది. చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ వుండిపోయారే కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. అయితే ఆమె ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిందని స్థానికులు చెప్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఓంటీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎస్‌పిఎస్ బాఘేల్ తెలిపారు. ఈ ఘటనపై ఏదైనా ఫిర్యాదు అందితే సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని బఘేల్ తెలిపారు. అయితే ఈ వీడియోలో మహిళ అతడిని కొట్టడాన్ని కొందరు వెతిరేకిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lambasingi Movie: బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి కొత్త సినిమా టైటిల్‌ ఖరారు.. స్వచ్ఛమైన ప్రేమ కథతో..

Prabhas: ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన ప్రభాస్.. అప్పుడే అనౌన్స్ చేస్తానంటూ..

Alia Ranbir Wedding: రణ్‌బీర్‌, అలియా ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. పెళ్లి తర్వాత ఎంత పెరిగాయంటే?