Watch: రాంగ్‌రూట్‌లో వచ్చిన స్కూల్ బస్సు.. బలంగా ఢీకొట్టిన కారు.. ఆరుగురు స్పాట్‌డెడ్‌.. షాకింగ్‌ వీడియో వైరల్‌

|

Jul 11, 2023 | 1:45 PM

ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృత్యువాతపడ్డారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈ రోజు ఉదయం పెళ్లి బృందం బస్సు అదుపు తప్పి సాగర్ కెనాల్ లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. అటు

Watch: రాంగ్‌రూట్‌లో వచ్చిన స్కూల్ బస్సు.. బలంగా ఢీకొట్టిన కారు.. ఆరుగురు స్పాట్‌డెడ్‌.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Ghaziabad Road Accident
Follow us on

ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృత్యువాతపడ్డారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈ రోజు ఉదయం పెళ్లి బృందం బస్సు అదుపు తప్పి సాగర్ కెనాల్ లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు.  అటు దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక స్కూల్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉదయం 6 గంటల సమయంలో స్కూల్ బస్సు, కారు మధ్య ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు రాంగ్ రూట్‌లో వస్తోందని తెలిసింది. ఇది బస్సు డ్రైవర్ తప్పిదంగా తెలిసింది. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉందని తెలిసింది. కాగా, చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్కూల్‌ బస్సు డ్రైవరు ఢిల్లీలోని ఘాజీపూర్‌ నుంచి రాంగ్‌ రూట్‌లో వస్తున్నాడు. అదే సమయంలో మీరట్‌ నుంచి గురుగ్రామ్‌ వెళ్తున్న కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో కారులో 8మంది ఉన్నట్టుగా తెలిసింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మొత్తం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వీడియో వైరల్‌ కావటంతో ఈ ఘటనను సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం స్పందించింది. రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి యోగి కార్యాలయం ట్విట్‌ చేసింది. ట్విట్టర్‌ వేదికగా మృతుల కుటుంబ సభ్యులకు సీఎం యోగి సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన బాధితులకు మెరుగై చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగం అధికారులను సీఎం ఆదేశించారు.

సీసీ ఫుటేజ్‌ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సు ఖాళీగా ఉందని, డ్రైవర్ ధర్మేంద్ర మద్యం మత్తులో ఉన్నాడని తెలిసింది. నిందితుడు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో నరేంద్ర, అబిత, హిమాన్షు, దీపాంషు, వంశిక, ఇంచోలి (మీరట్)కు చెందిన మరొకరు ఉన్నారు. అందరూ ఖతుష్యామ్‌ని సందర్శించడానికి వెళ్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..